News March 15, 2025

ఉచిత DSC శిక్షణకు నేడే తుది గడువు

image

తిరుపతి జిల్లాలో SC, ST అభ్యర్థులకు ఉచిత DSC కోచింగ్ కోసం దరఖాస్తులకు నేటి(శనివారం) వరకు అవకాశం ఉన్నట్లు జిల్లా ఎస్సీ సంక్షేమ, సాధికారత అధికారి విక్రమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వాటిని పరిగణలోకి తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. వారితో పాటూ బీసీలకు కూడా అవకాశం ఉందని బీసీ వెల్ఫేర్ అధికారి జోత్స్న తెలిపారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని వారు కోరారు. 

Similar News

News November 4, 2025

వేములవాడ రాజన్న ఆలయ ఇన్చార్జి ఈవోగా రాజేష్

image

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం తాత్కాలిక కార్యనిర్వహణాధికారిగా రాజేష్ నియమితులయ్యారు. ఆలయ ఈవో ఎల్ రమాదేవి వ్యక్తిగత పనులపై సెలవు మీద వెళ్లడంతో సీనియర్ అధికారి అయిన ఆలయ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రాజేష్‌కు తాత్కాలికంగా ఇన్చార్జి ఈవో బాధ్యతలు అప్పగించారు. ఈవో రమాదేవి విధుల్లో చేరే వరకు రాజేష్ ఇన్చార్జి ఈవోగా కొనసాగుతారు.

News November 4, 2025

వేములవాడ రాజన్నకు రికార్డు స్థాయిలో కోడె మొక్కులు

image

వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారికి కార్తీక మాసం రెండో సోమవారం సందర్భంగా రికార్డ్ స్థాయిలో భక్తులు కోడె మొక్కులు సమర్పించారు. ఆలయ అభివృద్ధి పనుల నేపథ్యంలో స్వామివారి అన్ని రకాల ఆర్జిత సేవలను రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం నుంచి భీమేశ్వర స్వామి వారి ఆలయానికి మార్చిన కారణంగా భక్తుల రద్దీ తగ్గుతుందనే అంచనాలకు భిన్నంగా సోమవారం సుమారు 5000 మంది భక్తులు కోడె మొక్కుబడి చెల్లించుకున్నారు.

News November 4, 2025

విజయనగరంలోనూ భూప్రకంపనలు?

image

విశాఖ, అల్లూరి జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున పలు చోట్ల భూమి కంపించింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో <<18192060>>భూకంపం<<>> నమోదైనట్ల మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ తన వెబ్‌సైట్‌లో మంగళవారం పొందుపరిచింది. మంగళవారం తెల్లవారుజామున 4.19 గంటలకు 3.7 పాయింట్ల తీవ్రత నమోదైనట్లు వెల్లడించింది. విజయనగరంలోనూ పలుచోట్ల భూమి కంపించినట్లు పలువురు కామెంట్లు చేస్తున్నారు.