News December 28, 2025

ఉజ్జయిని ఆలయానికి రూ.100 కోట్ల విరాళాలు

image

MPలోని ఉజ్జయిని మహాకాళేశ్వరుడి ఆలయానికి ఈ ఏడాది ₹107.93 కోట్లు విరాళాల రూపంలో వచ్చాయి. ఇందులో ₹13 కోట్ల విలువైన బంగారం ఉండటం గమనార్హం. ఈ ఏడాది డిసెంబర్ 15 వరకు 5.5 కోట్ల మంది ఆలయాన్ని దర్శించుకున్నారు. సగటున రోజూ 1.5L-2L మంది వస్తున్నారు. సెలవుల్లో రద్దీ ఎక్కువగా ఉంటోందని, క్రిస్మస్ రోజున 2.5 లక్షల మంది దర్శనానికి వచ్చారని ఆలయ కమిటీ తెలిపింది. న్యూఇయర్‌ దాకా మరో 6 లక్షల మంది వస్తారని చెప్పింది.

Similar News

News December 30, 2025

పుతిన్ నివాసంపై దాడి చేయలేదు: ఉక్రెయిన్

image

తమ అధ్యక్షుడు పుతిన్ నివాసంపై దాడికి <<18706923>>యత్నించారన్న<<>> రష్యా ఆరోపణలను ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ ఖండించారు. అంతా అబద్ధమని, ఉక్రెయిన్‌పై చేస్తున్న దాడులను సమర్థించుకునే కల్పితకథ అని మండిపడ్డారు. ‘ట్రంప్ టీమ్‌తో కలిసి మేం సాధించిన దౌత్య ప్రయత్నాల విజయాలను దెబ్బతీసేందుకు రష్యా ప్రమాదకర ప్రకటనలు చేస్తోంది. యుద్ధాన్ని ముగించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడానికి నిరాకరిస్తోంది’ అని ఆరోపించారు.

News December 30, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (డిసెంబర్ 30, మంగళవారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5:28 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.45 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12:19 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4:16 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5:52 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7:09 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News December 30, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.