News October 14, 2024

ఉజ్బెకిస్థాన్‌లో హుజురాబాద్ అధ్యాపకుడి ప్రసంగం

image

ఉజ్బెకిస్థాన్‌ దేశంలోని తాష్కెంట్ అల్ఫ్రాగానస్ యూనివర్సిటీలో శనివారం జరిగిన యునెస్కో ఆసియా పసిఫిక్ వ్యవస్థాపక విద్యాసదస్సులో హుజురాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు డా.మల్లారెడ్డి భారతదేశం తరఫున పాల్గొని ప్రసంగించారు. 21వ శతాబ్దంలో యువత ఎదుర్కొంటున్న సంక్లిష్ట సవాళ్లను అధిగమించే విద్యావిధానాల గురించి వివరించారు. కార్యక్రమంలో 40 దేశాల నుంచి 200 ప్రతినిధులు పాల్గొన్నారు.

Similar News

News October 14, 2024

జగిత్యాల డిప్యూటీ పారెస్ట్ రేంజ్ అధికారి సస్పెండ్

image

జగిత్యాల డిప్యూటీ పారెస్ట్ రేంజ్ అధికారి అరుణ్ కుమార్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. ఈ నెల 11న అటవీ శాఖ కార్యాలయంలో దావత్ నిర్వహించి ఆయన.. సిబ్బందితో కలిసి మద్యం తాగినట్లు అధికారులు తెలిపారు. ఘటనపై విచారణ జరిపి అరుణ్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ నిర్మల్ సర్కిల్ బాసర సీసీఎఫ్ శరవణన్ ఉత్తర్వులు జారీ చేశారు.

News October 14, 2024

కొండగట్టుకు వాహన పూజలతో రూ.3,37,900 ఆదాయం

image

మల్యాల మండలంలోని కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో దేవీ నవరాత్రోత్సవాల (దసరా) సందర్భంగా గతేడాది వాహన పూజల ద్వారా 3 రోజులకు రూ.2,67,600 ఆదాయం వచ్చిందని ఆలయ కార్య నిర్వహణాధికారి తెలిపారు. ఈ ఏడాది మూడు రోజులకు రూ.3,37,900ల ఆదాయం సమకూరిందని, ఈ సంవత్సరం వాహన పూజల ద్వారా రూ.70,300లు అదనంగా సమకూరిందని తెలిపారు.

News October 13, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి TOP న్యూస్

image

@ ఓదెల మండలంలో రైలు ఢీకొని వ్యక్తి మృతి.
@ రామాజీపేటలో దాడికి పాల్పడిన ఎనిమిది మందిపై కేసు.
@ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ.
@ మెట్‌పల్లిలో ఘనంగా బతుకమ్మల నిమజ్జనం.
@ జగిత్యాలలోని టిఫిన్ సెంటర్‌లో ఇడ్లీలో జెర్రీ.
@ మంథనిలో తాటిచెట్టుపై నుంచి పడి వ్యక్తికి గాయాలు.
@ కాటారం మండలం విలాసాగర్‌లో సీసీ కెమెరాల ప్రారంభం.