News September 22, 2025
ఉట్నూర్: ఐఏటీలో గిరిజన విద్యార్థిని ప్రతిభ

ఉట్నూర్ మండలంలోని గంగాన్నపేట్‌కు చెందిన కీర్తి జాతీయ స్థాయిలో నిర్వహించిన ఐఏటీ పరీక్షలో ప్రతిభ కనబరిచి 729వ ర్యాంక్ సాధించింది. ఒడిశాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్‌లో ఐదేళ్ల బీఎస్ఎంఎస్ కోర్సులో సీటు సంపాదించింది. ప్రతిభ కనబరిచిన కీర్తిని పలువురు అభినందించారు.
Similar News
News September 22, 2025
ADB: అగ్రి కళాశాల అసోసియేట్ డీన్‌గా డా.వై.ప్రవీణ్ కుమార్

వ్యవసాయ కళాశాల నూతన అసోసియేట్ డీన్‌గా డాక్టర్ ప్రవీణ్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇది వరకు డీన్‌గా ఉన్న డాక్టర్ శ్రీధర్ చౌహాన్ వ్యవసాయ పరిశోధన స్థానంలో ప్రధాన శాస్త్రవేత్తగా బదిలీపై వెళ్లారు. గతంలో ప్రవీణ్ కుమార్ కృషి విజ్ఞాన కేంద్రం ఆదిలాబాద్‌లో కోఆర్డినేటర్‌గా విధులు నిర్వహించారు. నూతనంగా విధులు స్వీకరించడం పట్ల కళాశాల సిబ్బంది అభినందనలు తెలిపారు.
News September 22, 2025
ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం చేయాలి: ADB SP

ఆదిలాబాద్ పోలీసు ముఖ్య కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలు ఎస్పీ అఖిల్ మహాజన్ ను నేరుగా కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. సమస్యలను విన్న ఎస్పీ సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలిచ్చి బాధితుల సమస్యల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రతి ఒక్క సమస్యను పరిశీలించి శాశ్వతంగా పరిష్కారం చూపాలని ఆదేశించారు. మొత్తం 43 ఫిర్యాదులు వచ్చినట్లు పేర్కొన్నారు.
News September 22, 2025
ప్రత్యేక నిపుణుల వైద్య శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలి: ADB కలెక్టర్

ఆదిలాబాద్ జిల్లాలో మంగళవారం SNSPA కార్యక్రమంలో భాగంగా ప్రజల కోసం ప్రత్యేక నిపుణుల వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాజర్షి షా ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఆయా మండలాల్లో నిర్వహిస్తున్న శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్త్రీ, చిన్న పిల్లల కంటి, చర్మ, పళ్ల సమస్యలు, చెవి-ముక్కు-గొంతు వ్యాధులు, కీళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.