News August 28, 2025

ఉట్నూర్: ఐటీఐ, ఏటీసీలలో ప్రవేశ గడువు పెంపు

image

ప్రభుత్వ ప్రైవేట్ ఐటీఐ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లలో(ATC)ల్లో ప్రవేశానికి గడువు పెంచినట్లు ఉట్నూర్ ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. అర్హులైన వారికి వాక్-ఇన్ అడ్మిషన్లు ఈ నెల 28 నుంచి 30 వరకు కొనసాగుతాయన్నారు. ఈ నెల 30 మధ్యాహ్నం 1 గంట వరకు ఆన్‌లైన్ ద్వారా అప్లికేషన్ సమర్పించాలన్నారు. ఏటీసీ కోర్సులతో మంచి భవిష్యత్తు ఉంటుందని యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News August 28, 2025

గణనాథునికి పూజలు నిర్వహించిన ADB ఎస్పీ

image

ఆదిలాబాద్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో భక్తిశ్రద్ధలతో గణనాథునికి ఘనంగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొని స్వయంగా మట్టి గణపతి ప్రతిమను ప్రతిష్ఠించారు. గణపతి ఉత్సవాలను ప్రజలందరూ పోలీసుల సూచనలను పాటిస్తూ, వర్షం దృష్ట్యా జాగ్రత్తలు పాటిస్తూ ఉత్సవాలను జరుపుకోవాలని కోరారు. ఏఎస్పీ సురేందర్ రావు, డీఎస్పీలు పోతారం శ్రీనివాస్, ఇంద్రవర్ధన్ ఉన్నారు.

News August 28, 2025

నేడు విద్యాసంస్థలకు సెలవు : ADB కలెక్టర్

image

భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు ఈనెల 28న సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో, కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. విద్యార్ధుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ మేరకు అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

News August 28, 2025

ట్రాక్టర్ ఇసుక రూ. 400లకే : కలెక్టర్

image

ప్రభుత్వ పనులకు, వ్యక్తిగత పనులకు ట్రాక్టర్ ఇసుక కేవలం రూ.400 ధర మాత్రమే విక్రయించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా వెల్లడించారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇసుక అవసరం ఉన్నవారు భీంపూర్, బేల, జైనథ్, బోరజ్ మండల తహాశీల్దార్ నుంచి అనుమతి తీసుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక ఉచితంగా ఇవ్వడం జరుగుతోందన్నారు.