News December 9, 2025
ఉట్నూర్: విద్యార్థులకు ITDA PO మార్గనిర్దేశనం

సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఉట్నూర్ ఆధ్వర్యంలో కేర్ అకాడమి కేబీ కాంప్లెక్స్‌లో నెల రోజుల అసిస్టెంట్ నర్స్ శిక్షణ పూర్తి చేసుకొని ఆన్ జాబ్ ట్రైనింగ్‌కు ఎంపికైన విద్యార్థులను ITDA PO యువరాజ్ మర్మాట్ అభినందించారు. శిక్షణను సద్వినియోగం చేసుకొని మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జేడీఎం నాగభూషణం, విద్యా అకాడమీ మేనేజర్ అశోక్, సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News December 12, 2025
కరీంనగర్: మొదటి విడతతో కాంగ్రెస్ ముందంజ

ప్రస్తుతం జరిగిన మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు అధిక సంఖ్యలో గెలుపొందగా ముందు వరసలో నిలిచింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొదటి విడతలో 398 పంచాయతీలకు గాను, కాంగ్రెస్ 211, బీఆర్‌ఎస్ 106, బీజేపీ 35, ఇతరులు 43 స్థానాల్లో గెలుపొందారు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 53% సీట్లతో ముందంజలో ఉంది.
News December 12, 2025
పలమనేరు: బస్సు ప్రమాదంలో దంపతులు మృతి

అల్లూరి సీతారామ రాజు జిల్లాలో బస్సు లోయలో పడిన దుర్ఘటనలో తొమ్మిది మంది దుర్మరణం చెందిన ఘటన తెలిసిందే. ఈ ప్రమాదంలో పలమనేరుకు చెందిన ఇద్దరు మృతి చెందినట్లు తెలుస్తోంది. మునినారాయణ శెట్టి వీధికి చెందిన భార్యాభర్తలు సునంద, శివశంకర్ రెడ్డి ఈ ప్రమాదంలో చనిపోయారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News December 12, 2025
హనుమాన్ చాలీసా భావం – 36

సంకట హటై మిటై సబ పీరా|
జో సుమిరై హనుమత బలవీరా||
శక్తిమంతుడు, పరాక్రమవంతుడు అయిన హనుమంతుడిని ఎవరైతే భక్తితో స్మరించుకుంటారో, వారికి కలిగే అన్ని రకాల సంకటాలు, ఇబ్బందులు వెంటనే తొలగిపోతాయి. వారిని పీడిస్తున్న బాధలు, దుఃఖాలు కూడా పూర్తిగా చెరిగిపోతాయి. హనుమంతుడి స్మరణ అనేది భక్తులకు బలం, ధైర్యం, కష్టాల నుంచి విముక్తిని ప్రసాదిస్తుంది. <<-se>>#HANUMANCHALISA<<>>


