News September 22, 2025
ఉడిత్యాలలో అత్యధిక వర్షపాతం

మహబూబ్ నగర్ జిల్లాలో గడిచిన వివిధ ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. అత్యధికంగా బాలానగర్ మండలం ఉడిత్యాల 97.3 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు అయింది. నవాబుపేట మండలం కొల్లూరు 71.5, మహబూబ్ నగర్ గ్రామీణ 50.5, గండీడ్ మండలం సల్కర్ పేట 47.3, భూత్పూర్ 31.3, కోయిలకొండ మండలం పారుపల్లి 24.3, మహమ్మదాబాద్ 19.3, హన్వాడ 18.5, మిడ్జిల్ 9.5, అడ్డాకుల 5.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
Similar News
News February 11, 2026
మహబూబ్‌నగర్ జిల్లాలో 69.5% ఓటింగ్ నమోదు

మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 2 పురపాలికలు, 1 నగరపాలికలలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 69.05 ఓటింగ్ నమోదు అయినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. దేవరకద్రలో 85.51 శాతం ఓటింగ్, భూత్పూర్‌లో 84.58 శాతం ఓటింగ్ నమోదయ్యింది. అలాగే మహబూబ్‌నగర్ నగరపాలికలో 67.73% ఓటింగ్ నమోదు అయినట్లు పేర్కొన్నారు.
News February 11, 2026
కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేసిన ఏపీ జితేందర్ రెడ్డి

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం 44 డివిజన్ పంచాయితీ రాజ్ కాలనీలోని పోలింగ్ బూత్‌లో ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడం మన అందరి బాధ్యత అన్నారు. టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
News February 11, 2026
MBNR:మోడల్ స్కూల్.. అప్లై చేసుకోండి

మహబూబ్ నగర్(D) గండీడ్ మండలం వెన్నాచేడ్ ఆదర్శ పాఠశాలలో (మోడల్ స్కూల్) చేరెందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ రాయిస్ ఫాతిమా “Way2News” ప్రతినిధితో తెలిపారు. 6వ తరగతిలో 100 సీట్లు, 7,8,9,10 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లను దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని, https://tgms.telangana.gov.in వెబ్ సైట్‌లో ఈనెల 28లోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.SHARE IT.


