News June 4, 2024
ఉత్కంఠగా మహబూబ్‌నగర్‌లో కౌంటింగ్

మహబూబ్‌నగర్ లోక్‌సభ ఓట్ల కౌంటింగ్ ఉత్కంఠంగా సాగుతోంది. 17వ రౌండ్ ముగిసేవరకూ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ కేవం 3000 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు. రౌండ్ రౌండ్‌కు నువ్వా నేనా అన్నట్లు సాగుతున్న కౌంటింగ్ కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల్లో టెన్షన్ పుట్టిస్తోంది. మొదటి నుంచి లీడ్‌లో కొనసాగిన డీకే అరుణ ఆధిక్యం తాజాగా తగ్గడంతో కమలం పార్టీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది.
Similar News
News February 14, 2026
MBNR: లెక్కింపు ప్రక్రియ విజయవంతం: ఎస్పీ

పాలమూరు కార్పొరేషన్, దేవరకద్ర, భూత్పూర్ మున్సిపాలిటీలలో నిర్వహించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ విజయవంతంగా పూర్తి అయిందని ఎస్పీ జానకి తెలిపారు. లెక్కింపు కేంద్రాల దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిందన్నారు. వారం రోజులుగా కొనసాగిన ఎన్నికల ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించిన జిల్లా పోలీస్ అధికారులు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
News February 14, 2026
MBNR: మున్సిపల్ ఎన్నికలు.. మహిళా అభ్యర్థుల విజయకేతనం

మహబూబ్‌నగర్ జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో మహిళా అభ్యర్థులు ప్రభంజనం సృష్టించారు. జిల్లాలోని రెండు పురపాలికలు, ఒక నగరపాలికలో జరిగిన ఎన్నికల్లో 32 మందికి పైగా మహిళలు విజయం సాధించి తమ సత్తా చాటారు. దేవరకద్ర, భూత్పూర్, మహబూబ్‌నగర్‌లలో మహిళల అఖండ విజయాలు రాజకీయాల్లో మారుతున్న ట్రెండ్‌కు, వారి ఉత్తేజానికి నిదర్శనంగా నిలిచాయి.
News February 14, 2026
మహబూబ్‌నగర్‌లో రీకౌంటింగ్..!

మహబూబ్‌నగర్ మేయర్ పీఠం ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. మొత్తం 60 డివిజన్లకు గాను 59 డివిజన్లలో పోలింగ్ జరిగింది. 58వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి ఏకగ్రీవంగా విజయం సాధించారు. 59 స్థానాల్లో కాంగ్రెస్-29, BRS-15, BJP-7, ఇతరులు 8 మంది విజయం సాధించారు. అయితే 53వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి తన సమీప ప్రత్యర్థి అయిన బీఆర్ఎస్ అభ్యర్థిపై 29 ఓట్ల మెజార్టీ రాగా.. అక్కడ రీకౌంటింగ్ జరుగుతోంది.


