News December 17, 2025

ఉత్కంఠ.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్‌ తీర్పు నేడే!

image

TG: ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ ప్రసాద్ నేడు తీర్పు ప్రకటించనున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేల అడ్వకేట్లకు ఆయన నోటీసులు పంపారు. 3.30PMకు స్పీకర్‌ ఆఫీసుకు BRS, ఫిరాయింపు ఎమ్మెల్యేల అడ్వకేట్లు రానున్నారు. అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావ్‌, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ప్రకాశ్ గౌడ్‌, గూడెం మహిపాల్‌రెడ్డిపై అనర్హత పిటిషన్లు దాఖలయ్యాయి. స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

Similar News

News December 18, 2025

OG కోసం సొంత కారు అమ్మిన డైరెక్టర్!

image

డైరెక్టర్ సుజీత్‌కు హీరో పవన్ కళ్యాణ్ ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును గిఫ్ట్ ఇచ్చిన <<18579913>>విషయం<<>> తెలిసిందే. ఆ కారును పవన్ గిఫ్ట్‌గా ఎందుకిచ్చారో సినీవర్గాలు తెలిపాయి. ‘OGలోని కొన్ని సీన్లు జపాన్‌లో షూట్ చేద్దామనుకుంటే బడ్జెట్ వల్ల నిర్మాత ఒప్పుకోలేదు. ఈ సీన్ ప్రాధాన్యం దృష్ట్యా సుజీత్ తన కారు అమ్మేసి షూట్ పూర్తిచేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పవన్.. అదే మోడల్ కారును గిఫ్ట్‌గా ఇచ్చారు’ అని పేర్కొన్నాయి.

News December 18, 2025

ముంబై ‘జుగాడ్’.. జనం మెచ్చిన ఐడియా!

image

పైనున్న ఫొటో చూసి అవాక్కయ్యారా? ముంబైలో ఆకాశాన్నంటుతున్న అద్దెలను తట్టుకోలేక 20 మందికి పైగా వైద్యులు కలిసి ఇలా ఒకే చిన్న గదిని క్లినిక్‌గా మార్చుకున్నారు. ఒకేసారి అందరూ ఉండకుండా షిఫ్టుల వారీగా ఒకరి తర్వాత ఒకరు అందుబాటులో ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. దీంతో ఆ చిన్న గదే ఇప్పుడు అన్ని రకాల వైద్యులు దొరికే ‘మల్టీ స్పెషాలిటీ’ హాస్పిటల్‌గా మారింది. ప్రస్తుతం ఈ ఫొటో SMలో వైరల్ అవుతోంది.

News December 18, 2025

గతేడాదితో పోలిస్తే నేరాలు తగ్గుముఖం: DGP

image

AP: గతేడాదితో పోలిస్తే రాష్ట్రంలో నేరాలు తగ్గుముఖం పట్టాయని DGP హరీశ్ గుప్తా పేర్కొన్నారు. ‘2023-24లో 1,10,111 నేరాలు నమోదైతే 2024-25లో 1,04,095 దాఖలయ్యాయి. అల్లర్లు 52.4%, SC, STలపై నేరాలు 22.35%, స్త్రీలపై అకృత్యాలు 22.35% తగ్గాయి. 4 నెల‌ల్లో 2,483 మంది అదృశ్య‌మైన మ‌హిళ‌ల ఆచూకీ క‌నుగొన్నాం. వారిలో 1177 మంది యువ‌తులున్నారు’ అని తెలిపారు. 55% మేర రిక‌వ‌రీ రేటు సాధించామ‌ని డీజీపీ వెల్లడించారు.