News July 5, 2024

ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

2024-25 విద్యా సంవత్సరానికిగాను ప్రభుత్వ, ఎయిడెడ్, గుర్తింపు పొందిన పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు నుంచి జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారిణి ఎల్.చంద్రకళ తెలిపారు. ఆన్లైన్లో అర్హతలు, వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. జులై 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Similar News

News July 8, 2024

విశాఖ: నేటి నుంచి ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్లు

image

ఇంజనీరింగ్ కళాశాలలో ప్రవేశాలకు నిర్వహిస్తున్న కౌన్సిలింగ్‌లో భాగంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు ఆదివారంతో ముగిశాయి. వెబ్ ఆప్షన్లను సోమవారం నుంచి ఈనెల 12 వరకు ఎంపిక చేసుకోవాలని కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ సూర్యనారాయణ ఆదివారం తెలిపారు. 13న వెబ్ ఆప్షన్లు మార్చుకోవచ్చన్నారు. 16న సీట్ల కేటాయింపు 17 నుంచి 22 వరకు సెల్ఫ్ జాయినింగ్ రిపోర్టు చేయాలన్నారు. 19న క్లాసులు ప్రారంభమవుతాయన్నారు

News July 8, 2024

అనకాపల్లి: ప్రాణాలు తీసిన ఫొటోల సరదా

image

మాడుగుల మండలం తాచేరు ప్రాంతంలో ఫొటోలు దిగేందుకు వచ్చిన గుర్రం చందుమోహన్, గుబ్బల జ్ఞానేశ్వర్ అనే బావ బామ్మర్దులు నీటిలో మునిగి చనిపోయినట్లు ఎస్సై దామోదర్ నాయుడు తెలిపారు. తాచేరులో రాయిపై చందుమోహన్ నిల్చుని ఫొటో తీసుకుంటూ నీటిలో పడిపోగా.. అతనిని రక్షించేందుకు జ్ఞానేశ్వర్ నీటిలో దూకాడు. ఇద్దరికీ ఈత రాకపోవడంతో నీటిలో మునిగి మరణించినట్లు పేర్కొన్నారు. మృతదేహాలను అనకాపల్లి ఆసుపత్రికి తరలించారు.

News July 8, 2024

అనకాపల్లి: హత్యకు ముందు లేఖ రాసిన నిందితుడు

image

రాంబిల్లి మండలం కొప్పుగుండుపాలెంలో బాలిక హత్య కేసులో నిందితుడు సురేశ్ ఆచూకీ ఇంకా దొరకలేదు. హోం మంత్రి ఆదేశాల మేరకు 12 పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. వ్యసనాలకు బానిసైన సురేశ్.. సైకో మాదిరిగా ప్రవర్తిస్తుంటాడని అతని పరిచయస్థులు తెలిపారు. తాను ఎందుకు హత్యచేశానో బాలిక అన్నయ్యకు ఓ లేఖను రాసి దాన్ని సంఘటనా స్థలం వద్దే ఉంచాడు. నిందితుడు ఫోన్ వాడకపోవడంతో పోలీసులకు సవాల్‌గా మారింది.