News January 24, 2025

ఉత్త‌మ జిల్లా ఎన్నిక‌ల అధికారిగా తిరుపతి జిల్లా క‌లెక్ట‌ర్

image

జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్బంగా జిల్లాను అవార్డులు వరించాయి. ఉత్త‌మ జిల్లా ఎన్నిక‌ల అధికారిగా తిరుపతి జిల్లా క‌లెక్ట‌ర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎంపికయ్యారు. ఉత్తమ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ ఎస్పీగా తిరుపతి జిల్లా ఎస్‌పి హర్షవర్ధన్ రాజు ఎంపికయ్యారు. వీరితో పాటుగా 122-వెంకటగిరి నియోజకవర్గ EROB సుధారాణి, ఉత్తమ EROగా తిరుపతి అర్బన్ తహశీల్దార్ భాగ్యలక్ష్మి ఎంపికయ్యారు.

Similar News

News November 8, 2025

MP సాన సతీశ్‌పై CM చంద్రబాబు ఆగ్రహం!

image

AP: గన్నవరం విమానాశ్రయంలో WC విన్నర్ శ్రీ చరణికి స్వాగతం పలికే విషయంలో ప్రొటోకాల్ వివాదం నెలకొంది. విమానాశ్రయానికి మంత్రులు, శాప్, ACA ప్రతినిధులు వెళ్లారు. శ్రీ చరణి ఉన్న లాంజ్‌లోకి BCCI మాజీ చీఫ్ సెలెక్టర్ MSK ప్రసాద్‌ని ప్రోటోకాల్ పోలీసులు వెళ్లనివ్వలేదు. దీనిపై MSKతో CM మాట్లాడారు. MP, ACA సెక్రటరీ సానా సతీశ్‌పై CM ఆగ్రహించినట్లు సమాచారం. ఇలాంటివి రిపీటవ్వకుండా చూసుకోవాలని ACAను ఆదేశించారు.

News November 8, 2025

నవంబర్ 8: చరిత్రలో ఈరోజు

image

1948: గాంధీని హత్య చేసినట్లు అంగీకరించిన గాడ్సే
2016: పాత రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన కేంద్రం
1656: తోకచుక్కను కనుగొన్న సైంటిస్ట్ ఎడ్మండ్ హేలీ జననం
1927: బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ జననం
1969: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జననం
1977: డైరెక్టర్ బీఎన్ రెడ్డి మరణం
2013: కమెడియన్ ఏవీఎస్ మరణం

News November 8, 2025

హోంగార్డుల సంక్షేమానికి కృషి: ఎస్పీ

image

హోంగార్డుల సంక్షేమానికి తాము కట్టుబడి ఉంటామని కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ స్పష్టం చేశారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో ఉద్యోగ విరమణ పొందిన హోంగార్డులు పి. జాన్, సీహెచ్ భవానీలకు ‘చేయూత’ కింద రూ.6.55 లక్షల చెక్కులను ఎస్పీ అందజేశారు.