News June 13, 2024
ఉత్తరాంధ్రకు చంద్రబాబు ప్రాధాన్యత: విజయనగరం ఎంపీ

ఉత్తరాంధ్రకు చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చారని ఎంపీ అప్పలనాయుడు అన్నారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తరాంధ్రకు ఒక కేంద్రమంత్రి పదవి ఇచ్చారని పేర్కొన్నారు. విశాఖ నగరాన్ని ఆర్థిక రాజధానిగా ప్రకటించారని తెలిపారు. స్కూల్ బ్యాగ్స్‌పై జగన్ ఫొటో ఉన్నా కూడా పంపిణీకి చంద్రబాబు ఆదేశించడం గొప్ప విషయమని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని, సామాజిక న్యాయం పాటించి మంత్రి పదవులు ఇచ్చారన్నారు.
Similar News
News September 29, 2025
VZM: కలెక్టరేట్‌లో నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎస్.రామ సుందర్ రెడ్డి ఆదివారం తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. అన్ని శాఖల జిల్లా అధికారులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. అర్జీదారులు Meekosam.ap.gov.in వెబ్ సైట్‌లో కూడా వారి అర్జీలు నమోదు చేసుకోవచ్చన్నారు.
News September 27, 2025
పైడిమాంబ సిరిమానోత్సవానికి సీఎంకు ఆహ్వానం

ఉత్తరాంధ్ర భక్తుల ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు అక్టోబర్ 6, 7 తేదీల్లో జరగనున్న సందర్భంగా సీఎం చంద్రబాబుకు ఉమ్మడి జిల్లా ప్రజా ప్రతినిధులు ఆహ్వానం పలికారు. రాష్ట్ర పండగగా జరిగే శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని సీఎంను ఆహ్వానించినట్లు మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి తెలిపారు.
News September 27, 2025
అక్టోబర్ 1న జిల్లాకు సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు అక్టోబర్ 1న జిల్లాలో పర్యటించనున్నారు. దత్తిరాజేరు మండలంలోని దత్తి గ్రామాన్ని సందర్శించి పలువురు లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జేసీ సేతుమాధవన్, డీఎస్పీ రాఘవులు, తదితరులు హెలీ ప్యాడ్, సభావేదికకు సంబందించి ఏర్పాట్లును శనివారం పరిశీలించారు. పర్యటనకు సంబందించి షెడ్యూల్ ఇంకా విడుదల కావాల్సి ఉంది.