News November 19, 2025
ఉత్తరాంధ్రలో అంచనాల కమిటీ పర్యటన

AP అంచనాల కమిటీ ఈనెల 25-29 వరకు ఉత్తరాంధ్రలో పర్యటించనుంది. ఛైర్మన్ వేగుళ్ల జోగేశ్వరరావు అధ్యక్షతన కమిటీ సభ్యులు 25న విశాఖ చేరుకుంటారు. 26న సింహాచలంలో స్వామిని దర్శనం చేసుకొని.. దేవాదాయ శాఖ అధికారులతో సమావేశమౌతారు. అనంతరం కలెక్టరేట్‌లో అధికారులతో చర్చించనున్నారు. 2019-20, 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాల్లో జరిగిన పనులకు సంబంధించిన అంశాలపై సమీక్షిస్తారు.
Similar News
News April 14, 2026
విశాఖ-బ్రహ్మపూర్ రైలు రీషెడ్యూల్

విశాఖపట్నం-బ్రహ్మపూర్ ప్యాసింజర్ రైలు (58532) మంగళవారం రీషెడ్యూల్ అయింది. లింక్ రైలు ఆలస్యంగా రావడంతో సాయంత్రం 5:45 గంటలకు బదులు 6:45 గంటలకు బయలుదేరుతుందని సీనియర్ డీసీఎం కె.పవన్ కుమార్ తెలిపారు. ప్రయాణికులు ఈ సమయ మార్పును గమనించాలని, వారికి కలిగిన అసౌకర్యానికి రైల్వే శాఖ విచారం వ్యక్తం చేస్తోందని ఆయన పేర్కొన్నారు.

విశాఖలోని ఒక్కరోజే 2474 కేసులు

విశాఖలోని ట్రాఫిక్ పోలీసులు సోమవారం ఒక్కరోజే 2,474 కేసులు నమోదు చేశారు. వాటి వివరాలిలా ఉన్నాయి. హెల్మెట్ ధరించనని-1,209, పిలియన్ రైడర్-226, ట్రిపుల్ రైడింగ్- 112, ఓవర్ స్పీడ్-223, సెల్ఫోన్ డ్రైవింగ్-19, డ్రైవింగ్ లైసెన్స్ లేనివి-06, మైనర్ డ్రైవింగ్ 02, రాంగ్ పార్కింగ్-191, డ్రంకన్ డ్రైవింగ్-47, సీజ్ అయిన వెహికల్స్-58 ఎంవీ యాక్ట్ ఉల్లంఘన-501 కేసులు ట్రాఫిక్ పోలీసులు నమోదు చేశారు.