News October 11, 2025
ఉత్తరాంధ్రలో అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లండి: చంద్రబాబు

అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా ఉత్తరాంధ్రలో చేపడతున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో విఫలమవుతున్నామని CM చంద్రబాబు వ్యాఖ్యనించారు. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుతో పాటు స్టీల్‌ప్లాంట్ మూతపడకుండా కాపాడామన్నారు. ముఖ్యంగా IT కంపెనీల స్థాపన, గూగుల్ డేటా సెంటర్, మిట్టల్ స్టీల్ వంటి కీలక ప్రాజెక్టులు త్వరలో ప్రారంభం కానున్నాయన్నారు. అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులను ఆదేశించారు.
Similar News
News October 11, 2025
రేపు ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్, ఓపెన్ CLSకు శంకుస్థాపన

AP: మంత్రి నారా లోకేశ్ రేపు విశాఖలో సిఫీ(Sify) ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్(CLS)కు శంకుస్థాపన చేయనున్నారు. సిఫీ రూ.1,500 కోట్ల పెట్టుబడి, వెయ్యి మందికి పైగా ఉద్యోగాలు కల్పించనుంది. ఇండియాతో పాటు సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా, థాయ్‌లాండ్ వంటి దేశాల మధ్య త్వరితగతిన డేటా ప్రాసెసింగ్ చేస్తూ విశాఖ CLS వ్యూహాత్మక ల్యాండింగ్ పాయింట్‌గా పనిచేయనుంది.
News October 11, 2025
విజయవాడ: నూతన డాగ్ కెనాల్స్ ప్రారంభం

పోలీసు కమిషనరేట్ పరిధిలో VIP భద్రత, నార్కోటిక్స్, నేర పరిశోధనల కోసం శిక్షణ పొందిన డాగ్లను ఉపయోగిస్తారు. ఈ నేపథ్యంలో నూతనంగా నిర్మించిన డాగ్ కెనెల్స్‌ను పోలీసు కమిషనర్ రాజశేఖర్ బాబు లాంఛనంగా ప్రారంభించారు. శిక్షణ పొందిన డాగ్‌లు స్వాగతం పలికి, మెళుకువలు ప్రదర్శించాయి. డీసీపీలు కె.జి.వి. సరిత, కె. తిరుమలేశ్వర రెడ్డి, ఏ.బి.టి.ఎస్. ఉదయ రాణి, ఇతర అధికారులు హాజరయ్యారు.
News October 11, 2025
ప్రజా పాలనలో గ్రామాలు దూసుకెళ్తున్నాయ్: పొంగులేటి

నేలకొండపల్లి మండలం పైనంపల్లి గ్రామంలో నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలా కాకుండా తమ ప్రభుత్వం ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకు వెళుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నుపూసల సీతారాములు, కాంగ్రెస్ నేతలు, తదితరులు పాల్గొన్నారు.