News February 26, 2025
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సర్వం సిద్ధం

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ ఆదేశాలకు అనుగుణంగా రెవెన్యూ అధికారులు ఎన్నికకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేశారు. జిల్లాలో మొత్తం 5,223 మంది ఉపాధ్యాయులు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 3,270 మంది పురుషులు కాగా, 1,953 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.
Similar News
News February 26, 2025
విశాఖలో మర్డర్ చేసిన విజయనగరం వ్యక్తి

విజయనగరం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి విశాఖలో దారుణ హత్య చేశాడు. రామతీర్థానికి చెందిన వై.శ్రీను, విశాఖలోని రామ్‌నగర్‌కు చెందిన ఆనంద్ ఇద్దరూ కలిసి సోమవారం రాత్రి వెంకోజిపాలెం వద్ద మద్యం తాగారు. ఈక్రమంలో ఇద్దరి మధ్య ఘర్షణ చెలరేగింది. భయపడి ఆనంద్ పారిపోగా.. శ్రీను వెంటపడి మరీ రాయితో కొట్టి చంపేశాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News February 26, 2025
VZM: పెళ్లి పేరుతో మోసం.. 20ఏళ్లు జైలు శిక్ష..!

పెదమానాపురంలో 2023లో నమోదైన పోక్సో కేసులో నిందితుడికి 20ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.4వేలు జరిమానా విధించినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. పెదమానాపురానికి చెందిన మారోతు వెంకటేశ్ (25) ఓ బాలికను పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేశాడు. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి నాగమణి తీర్పు వెల్లడించినట్లుగా ఎస్పీ పేర్కొన్నారు.
News February 25, 2025
విజయనగరం: బొత్సపై స్పీకర్ అయ్యన్న మండిపాటు

శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స పై స్పీకర్ అయ్యన్న పాత్రుడు మండిపడ్డారు. మంగళవారం ఏపీ అసెంబ్లీ సమావేశాల ప్రారంభంలో స్పీకర్ మాట్లాడారు. గవర్నర్ ప్రసంగం జరుగుతున్నప్పుడు సభలో YCP ప్రవర్తన పై స్పీకర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పార్టీ నేతల తీరును జగన్ నియంత్రించాల్సింది పోయి కూర్చొని నవ్వుకుంటారా? అని ప్రశ్నించారు. బొత్స వంటి సీనియర్ నేత పక్కనే ఉండి కూడా చేసేది తప్పని చెప్పలేదని ఫైర్ అయ్యారు.