News December 23, 2025

ఉత్తరాంధ్ర భూములపై TDP కన్ను: బొత్స

image

ఉత్తరాంధ్రపై TDP కన్ను పడిందని, విలువైన భూములను కొన్ని కంపెనీలకు అప్పనంగా ధారాదత్తం చేస్తోందని MLC బొత్స సత్యనారాయణ ఆరోపించారు. మంగళవారం విశాఖలో ఆయన మాట్లాడారు. ఎకరం రూ.50Cr-100Cr విలువైన భూములను తక్కువ ధరకు దోచిపెడుతోందని మండిపడ్డారు. భూ కేటాయింపుల్లో ఇన్‌సైడర్ వ్యవహారాలు జరుగుతున్నాయని దీనిపై కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. YCP అధికారంలోకి వచ్చాక విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు.

Similar News

News December 23, 2025

పరుగు పందెంలో సత్తా చాటిన జిల్లా అథ్లెట్లు

image

కామారెడ్డిలోని ఇందిరా గాంధీ స్టేడియంలో మంగళవారం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రాస్ కంట్రీ ఎంపిక పోటీలు సాగాయి. ఈ పోటీలను జిల్లా అడిషనల్ కలెక్టర్ మధు మోహన్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రతిభ చాటిన క్రీడాకారులకు బహుమతులు, సర్టిఫికేట్లు అందజేశారు. వీరు వచ్చే ఏడాది JUN 2న గచ్చిబౌలి స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా తరపున ప్రాతినిధ్యం ప్రాతినిధ్యం వహిస్తారు.

News December 23, 2025

కార్మికుల క్రమశిక్షణే సింగరేణి బలం: డైరెక్టర్ సూర్యనారాయణ

image

కార్మికుల శ్రమ, క్రమశిక్షణ, పరస్పర నమ్మకమే సింగరేణికి అసలైన బలమని ప్రాజెక్ట్ ప్లానింగ్ డైరెక్టర్ ఎల్.వి. సూర్యనారాయణ అన్నారు. మంగళవారం ప్రధాన కార్యాలయంలో జరిగిన సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు. భద్రతకు ప్రాధాన్యమిస్తూ, వనరులను సమర్థంగా వినియోగించుకుంటూ సంస్థను ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా సింగరేణి జెండాను ఆవిష్కరించి, ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు.

News December 23, 2025

నల్గొండ: ‘అధికారం కోల్పోయాక KTRకు కృష్ణ జలాలు గుర్తుకు రావడం విడ్డూరం’

image

అధికారం కోల్పోయాక కేటీఆర్, హరీశ్‌రావుకు కృష్ణ జలాలు గుర్తుకు రావడం విడ్డూరమని నల్గొండ డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాశ్ నేత మండిపడ్డారు. వారి తీరు సురభి నాటకాలను తలపిస్తోందని ఎద్దేవా చేశారు. పదేళ్ల పాలనలో ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసి,ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తున్నారని ధ్వజమెత్తారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టారని,రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రం సస్యశ్యామలమవుతుందన్నారు.