News April 1, 2025
ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించిన ఖైరిగూడ ఓసీపీ

బెల్లంపల్లి ఏరియా ఖైరిగూడ ఆసీఫ్ 2024-2025 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకుందని ఇన్‌ఛార్జ్ జీఎం నరేందర్ తెలిపారు. సింగరేణి సంస్థ ఏరియాకు 4.70 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం నిర్దేశించగా 5.43 లక్షల టన్నుల ఉత్పత్తి సాధించిందన్నారు. ఉత్పత్తి శాతం 116గా నమోదైనట్లు చెప్పారు. అధికారులు, కార్మికులు సమష్టి కృషితో రానున్న రోజుల్లో మరిన్ని లక్ష్యాలను చేరుకుంటామన్నారు.
Similar News
News February 27, 2026
విజయ్ భార్య విడాకుల పిటిషన్.. రాజకీయ కుట్ర?

హీరో విజయ్ భార్య సంగీత విడాకులు కోరడం వెనుక రాజకీయ కుట్ర ఉందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఓ నటితో ఆయనకు సంబంధం ఉన్నట్లు 2021లోనే గుర్తించానన్న ఆమె.. ఇప్పుడు కోర్టుకెక్కడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో ఏప్రిల్ 20న విజయ్ కోర్టుకు హాజరుకావాల్సి ఉందని, అప్పుడు ఎన్నికల ప్రచారంలో ఇబ్బందులు ఎదురవుతాయని చెబుతున్నారు. ప్రత్యర్థులు దీన్ని ఆయుధంగా చేసుకునే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
News February 27, 2026
కామారెడ్డి: బాధితుల వద్దకే పోలీసులు: ఎస్పీ

బాధితుడి ముంగిటకే వెళ్లి న్యాయం అందించే ‘సిటిజన్ సెంట్రిక్ పోలీసింగ్’ విధానాన్ని కామారెడ్డి జిల్లా పోలీసులు విజయవంతంగా అమలు చేస్తున్నారు. జిల్లాలో రెండు రోజుల్లో ఈ విధానం ద్వారా ఐదు వేర్వేరు ప్రాంతాల్లో పోలీసులు బాధితుల వద్దకు వెళ్లి ఫిర్యాదును స్వీకరించి FIRలను అందజేశారు. ఈ సేవలు పోలీసుల పట్ల ప్రజల్లో ఉన్న సామాజిక దృక్పథాన్ని మారుస్తున్నాయని ఎస్పీ రాజేశ్ చంద్ర ఆశాభావం వ్యక్తం చేశారు.
News February 27, 2026
నిర్మల్: పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో ఎస్పీ రివ్యూ సమావేశం

జిల్లా పోలీసు కార్యాలయంలో SP జానకి షర్మిల అధ్యక్షతన పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో కలిసి డిస్ట్రిక్ట్ ప్రాసిక్యూటర్ రివ్యూ కమిటీ సమావేశం నిర్వహించారు. గ్రేవ్ కేసుల్లో కోర్టులలో వచ్చిన అక్విటల్ తీర్పులపై సమగ్రంగా సమీక్ష చేపట్టారు. కేసులు అక్విటల్ కావడానికి గల కారణాలు, దర్యాప్తు లోపాలు, సాక్ష్యాధారాల సమర్పణలో ఉన్న సమస్యలు, సాక్షుల హాజరు తదితర అంశాలపై చర్చించారు. అనంతరం వారిని సన్మానించారు.


