News August 27, 2025
ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి: నిర్మల్ ఎస్పీ

వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా, సంతోషంగా జరుపుకోవాలని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల సూచించారు. భైంసాలోని క్యాంపు కార్యాలయంలో ఆమె హిందూ ఉత్సవ శాంతి కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. విగ్రహాల నిమజ్జనం వరకు ఉత్సవాలను శాస్త్రోక్తంగా, సంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News August 27, 2025
MDK: మూడు నెలల్లోనే కొత్త బ్రిడ్జి మునక

జాతీయ రహదారి విస్తరణలో హవేలీ ఘనపూర్ దాటినా తరువాత నాగపూర్ గేట్ వద్ద ప్రమాదకర మలుపును స్ట్రైట్ గా తీర్చిదిద్దారు. నక్క వాగు సమీపంలో బ్రిడ్జి నిర్మాణం కోసం ఇంజినీర్ ప్లాన్ వేశారు. రోడ్డు వేసిన రెండు, మూడు నేలల్లోనే కొత్త రోడ్డు నీట మునిగి రాకపోకలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. ప్రవాహంలో కారు కొట్టుకుపోగా ఓ యువకుడిని 4 గంటల తర్వాత ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించారు.
News August 27, 2025
రూమర్డ్ గర్ల్‌ఫ్రెండ్‌తో పృథ్వీ షా.. ఫొటో వైరల్

టీమ్ ఇండియా క్రికెటర్ పృథ్వీ షా, నటి, ఇన్‌ఫ్లూయెన్సర్ ఆకృతి అగర్వాల్ కలిసి వినాయక చవితి వేడుకలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ఇద్దరూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గత జూన్‌లో వీరు ఒకేచోట కనిపించడంతో డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. కాగా గతంలో నటి, మోడల్ నిధి తపాడియాతోనూ పృథ్వీ డేటింగ్ చేసినట్లు వార్తలొచ్చాయి. కొన్నేళ్లుగా ఫామ్ లేమితో బాధపడుతున్న అతడు తాజాగా బుచ్చిబాబు టోర్నీలో సెంచరీ చేశారు.
News August 27, 2025
పెద్దాపూర్ కెనాల్‌లో ట్రాక్టర్ బోల్తా.. ఒకరి గల్లంతు

వినాయకుని విగ్రహాన్ని తీసుకువస్తుండగా జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం పెద్దాపూర్ కెనాల్‌లో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో శ్రీకర్ అనే యువకుడు గల్లంతయ్యాడు. రామారావుపల్లె వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.