News April 12, 2025

ఉదయం 6 నుంచే పనిచేయండి: నారాయణ

image

మంత్రి నారాయణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కమిషనర్లను ఉదయం 6 గంటలకే నిద్ర లేపుతున్నారు. అమరావతి నుంచి శనివారం ఉదయం 6 గంటలకు కమిషనర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెల్లవారుజామున పట్టణాల్లో పర్యటించాలని ఆదేశించారు. తానూ ఏదో ఒక మున్సిపాల్టీలో ఉదయం 6 గంటలకు పర్యటిస్తానని చెప్పారు.

Similar News

News April 12, 2025

మత విద్వేషాలను రెచ్చగొట్టుతున్న భూమన: కాకర్ల

image

మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా భూమన కరుణాకర్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఉదయగిరి MLA కాకర్ల సురేశ్ విమర్శలు గుప్పించారు. టీటీడీ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారని ఆయన హెచ్చరించారు. భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ గోమరణాలపై చేస్తున్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రపంచవ్యాప్తంగా టీటీడీ భక్తుల మనోభావాలను ఆయన దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. 

News April 12, 2025

ఇంటర్ ఫలితాల్లో ఉదయగిరి విద్యార్థుల ప్రభంజనం

image

ఇంటర్ ఫలితాల్లో ఉదయగిరి ప్రాంత విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ప్రభంజనం సృష్టించారు. ఉదయగిరిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో సీనియర్ ఇంటర్ ఎంపీసీ విద్యార్థిని వేదముఖి 987 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో సత్తా చాటారు. ఉదయగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల సీనియర్ ఇంటర్ విద్యార్థిని లతిఫా 963 మార్కులు సాధించగా, జూనియర్ ఇంటర్ విద్యార్థిని అంజుమ్ 464 మార్కులు సాధించినట్లు ప్రిన్సిపల్ మధు కిరణ్ తెలిపారు.

News April 12, 2025

NLR: అమ్మోనియం లీక్.. 10మందికి అస్వస్థత

image

నెల్లూరు జిల్లాలో అమ్మోనియం గ్యాస్ లీక్ కలకలం రేపింది. తోటపల్లి గూడూరు మండలం అనంతవరంలోని ఓ రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లో గ్యాస్ లీకైంది. ఈ ఘటనలో సుమారు పదిమంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గ్రామంలోనూ గ్యాస్ వ్యాపించడంతో స్థానికులు మాస్కులు ధరించారు. రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే సంఘటన జరిగినట్లు తెలుస్తోంది.

error: Content is protected !!