News November 15, 2024
ఉదయగిరిలో 11 మంది సచివాలయ సిబ్బందికి నోటీసులు
ఉదయగిరి మండలంలోని పలు సచివాలయాల్లో పనిచేస్తున్న 11మంది సచివాలయ సిబ్బంది విధి నిర్వహణలో అలసత్వం వహించినందుకు ఎంపీడీవో అప్పాజీ షోకాజు నోటీసులు జారీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. షోకాజు నోటీసులు అందుకున్న వారిలో ఎనర్జీ, వెటర్నరీ, వెల్ఫేర్ అసిస్టెంట్లు, మహిళ పోలీసు, వీఆర్ఓ, ఏఎన్ఎంలు ఉన్నారని, వీరంతా మూడు రోజుల్లోపు వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు.
Similar News
News November 15, 2024
ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా కోట ప్రధాన రహదారి
ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా కోట ప్రధాన రహదారి మారింది. గుంతలమయంగా మారినా అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు వాపోతున్నారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి కోట క్రాస్ రోడ్డు వరకు గుంతలమయంగా మారింది. దానికి తోడు వర్షాలు కురవడంతో బురదమయంగా మారి వాహనదారులతోపాటు పాదాచారులు ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
News November 15, 2024
నెల్లూరు:11 మంది వెల్ఫేర్ అసిస్టెంట్లకు షోకాజ్ నోటీసులు
నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలో విధులు నిర్వర్తించే 11మంది వెల్ఫేర్ అసిస్టెంట్లకు గురువారం షోకాజ్ నోటీసులు అందజేసినట్లు ఎంపీడీవో వేణుగోపాలరావు తెలిపారు. విధి నిర్వహణలో నిర్లక్ష్య వైఖరి అవలంబించడంతో నోటీసులు అందజేయడం జరిగిందన్నారు. అలాంటివారు మూడు రోజుల్లోపు లిఖితపూర్వకంగా సంజాయిషీ అందజేయాలని ఆ నోటీసులో సూచించారు.
News November 15, 2024
వైసీపీ టాస్క్ ఫోర్స్ కమిటీలో నెల్లూరు జిల్లా నేతలకు చోటు
వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధులకు అండగా నిలిచేందుకు పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా టాస్క్‌ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా టాస్క్‌ఫోర్స్ కమిటీ సభ్యులుగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఉన్నారు.