News October 20, 2024
ఉదయగిరి దుర్గం కొండపై పర్యాటకుల సందడి

ఉదయగిరి దుర్గం కొండపై ఆదివారం ఉదయం నుంచి పర్యాటకుల సందడి ప్రారంభమైంది. ఇటీవల కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఉదయగిరి కొండపై నుంచి జలపాతం కిందకు దూకుతూ ఉండడంతో పాటు కొండ కింద సెలయేర్లు ప్రవహిస్తూ ఉండడంతో ఉదయగిరి వాసులే కాకుండా చుట్టుపక్క ప్రాంతాల నుంచి వాటిని చూసేందుకు వెళ్తున్నారు. కొండపై నుంచి ప్రవహిస్తున్న సెలయేర్లలో ఈత కొడుతూ ఉల్లాసంగా గడుపుతున్నారు.
Similar News
News March 2, 2026
నెల్లూరు: ఒక్క రోజులోనే రూ.వెయ్యి తగ్గింపు

నెల్లూరు జిల్లాలో నిమ్మ ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. చలి కాలం కావడంతో జనవరి నుంచి ఫిబ్రవరి ప్రారంభం వరకు ధరలు తక్కువగా ఉన్నాయి. ఎండలు పెరగడంతో ధరల్లో ఊపు వచ్చింది. ఒక్కో బస్తాను రూ.7వేల వరకు విక్రయించారు. హోలీ కారణంగా ఉత్తరాధి రాష్ట్రాల్లోని మార్కెట్లకు వారం రోజులు సెలవు ప్రకటించారు. దీంతో నిమ్మ బస్తా ధర ఒక్కరోజులోనే రూ.వెయ్యి పడిపోయింది. ప్రస్తుతం రూ.4500 నుంచి రూ.5500 వరకు విక్రయిస్తున్నారు.
News March 2, 2026
నెల్లూరు: కరెంట్ సమస్య ఉంటే కాల్ చేయండి!

నెల్లూరు జిల్లాలో చాలా మంది కరెంట్ మీటర్లు, నూతన కనెక్షన్లు ఇతర సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వాటి పరిష్కారానికి ‘డయల్ యువర్ ఎస్ఈ’ కార్యక్రమం నేడు నిర్వహిస్తున్నామని ఎస్ఈ రాఘవేంద్ర ఓ ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు ఉదయం 8:30 నుంచి 9:30 గంటల లోపు 0861 2320427 నంబర్‌కు కాల్ చేసి సమస్యలను చెప్పవచ్చు. వాటిని పరిష్కరించడానికి వెంటనే చర్యలు తీసుకుంటారు.
News March 2, 2026
నెల్లూరు: నేటి నుంచి ఓపెన్ పరీక్షలు

నెల్లూరు జిల్లాలో నేటి నుంచి ఓపెన్ పరీక్షలు ప్రారంభిస్తున్నట్లు డీఈవో ఆర్.బాలాజీ రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ విద్యార్థులకు నేటి నుంచి ఈనెల 13వ తేదీ వరకు, 10వ తరగతి విద్యార్థులకు 16 నుంచి 28వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ఇంటర్‌కు 12, 10వ తరగతికి 15 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.


