News January 2, 2026
ఉదయగిరి: మళ్లీ పులి వచ్చింది..!

ఉదయగిరి మండలం కొండకింద గ్రామాల్లో పెద్దపులి సంచరిస్తోందని అక్కడి ప్రజలు చెబుతున్నారు. బండగానిపల్లి ఘాట్ రోడ్డు, దుర్గం, జి.చెరువుపల్లి అటవీ ప్రాంతాల్లో తిరగడాన్ని తాము చూశామని నాలుగైదు రోజులుగా ప్రజలు చెబుతున్నారు. తాజాగా గురువారం రాత్రి 7గంటల సమయంలో కుర్రపల్లి-కృష్ణాపురం మార్గంలో జువ్విమాను బాడవ వద్ద పులి రోడ్డు దాటడాన్ని కృష్ణారెడ్డిపల్లికి చెందిన దేవసాని శ్రీనివాస్ రెడ్డి చూశారు.
Similar News
News February 13, 2026
కాకాణి కుమార్తెకు నోటీసులు

కోవూరు మండలంలో ఇటీవల మైనర్ బాలిక మృతి దుమారం రేపింది. ఈక్రమంలో ఆమె మృతిపై వైసీపీ నేతలు పలు ఆరోపణలు చేశారు. నిరాధార ఆరోపణలు చేశారని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజితపై కోవూరు పోలీసులు కేసు నమోదు చేశారు. 16వ తేదీ విచారణకు రావాలని వాట్సాప్ ద్వారా నోటీసులు పంపారు. బాలిక మృతి మీద ఆమె దగ్గర ఉన్న ఆధారాలు తీసుకుని రావాలని కోరారు.
News February 13, 2026
నెల్లూరు: మహిళలకు ఆ బస్సుల్లోనూ ఫ్రీ

శివరాత్రి సందర్భంగా నెల్లూరు జిల్లా నుంచి పలు ప్రాంతాలకు RTC తరఫున 147 స్పెషల్ బస్సులను ఏర్పాటు చేశామని ప్రజా రవాణా అధికారి షేక్ షమీం తెలిపారు. ఈ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తామన్నారు. 14, 15, 16వ తేదీల్లో శ్రీశైలం, కోటప్పకొండ, సిద్ధేశ్వరం, మైపాడు తదితర ప్రాంతాలకు బస్సులు నడుస్తాయని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News February 13, 2026
నెల్లూరుకు మంచి రోజులు వస్తున్నాయి..!

నెల్లూరు జిల్లాకు పరిశ్రమలు క్యూ కడుతున్నాయి. రూ.1000 కోట్లతో ప్రీమియం ఎక్స్‌ప్లోజివ్స్ సంస్థ పరిశ్రమ పెట్టనుంది. రాకెట్‌లో వినియోగించే పేలుడు పదార్థాలను ఈ సంస్థ తయారు చేయనుంది. దుత్తలూరు మండలం రాచవారిపల్లి, బ్రహ్మేశ్వరం పరిధిలో వీరికి 500 ఎకరాలు కేటాయించనున్నారు. స్టెయిన్‌లెస్ స్టీల్ ఉత్పత్తి చేసే రెనైసెన్స్ అనే మరో సంస్థ సైతం రూ.4వేల కోట్లు పెట్టడానికి ఆసక్తి చూపుతోంది.


