News June 30, 2024
ఉదయగిరి: శిథిలావస్థలో ఆలయాలు
వెయ్యేళ్ల చరిత్ర కలిగిన ప్రదేశం ఉదయగిరి. చారిత్రిక సంపదతో పాటు ప్రకృతి అందాలకు నెలవు. రాయలవారు దేశాన్ని జయించినా ఉదయగిరి వైపు అడుగులు కూడా వేయలేకపోయారు. చివరకు సంధి మార్గం ద్వారా ఉదయగిరి కోటను జయించారు. ఇక్కడ ఎన్నో ఆలయాలు నిర్మించారు. అప్పట్లో ప్రతి ఆలయం నిత్య ధూప దీప నైవేద్యాలతో కళకళలాడేది. నేడు ఉదయగిరిలోని ఆనాటి దేవాలయాలు శిథిలావస్థకు చేరుకున్నాయి.
Similar News
News January 19, 2025
సూళ్లూరుపేట: పర్యాటకులకు ఉచిత బస్సు సౌకర్యం
ఫ్లెమింగో ఫెస్టివల్‌కు వచ్చే పర్యాటకుల కోసం సూళ్లూరుపేట నుంచి ఆది, సోమవారాల్లో (19,20 తేదీలు) అటకానితిప్ప, నేలపట్టు, బీవీ పాలెం పర్యాటక ప్రాంతాలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినట్లు జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ తెలిపారు. ఇందుకోసం 10 బస్సులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పర్యాటకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
News January 18, 2025
నెల్లూరు నగరంలో భారీ ర్యాలీ
ప్రజలందరి భాగస్వామ్యంతో స్వచ్ఛ ఆంధ్ర సాకారం అవుతుందని నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు నెల్లూరు నగరంలో వీఆర్సీ నుంచి గాంధీ బొమ్మ వరకు ర్యాలీ నిర్వహించారు, గాంధీ బొమ్మకు పూలమాలవేసి నివాళులర్పించారు. జిల్లాలో 722 గ్రామ పంచాయతీలతో పాటు, మున్సిపాలిటీలలో కూడా స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.
News January 18, 2025
నెల్లూరుకు నీరు రావడం NTR పుణ్యమే: సోమిరెడ్డి
తెలుగుగంగ ప్రాజెక్టును రూపొందించి నెల్లూరు నేలను కృష్ణా జలాలతో తడిపిన ఘనత నందమూరి తారక రామారావుదేనని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి ఏపీలోనే ఏ జిల్లాకు లేని విధంగా నెల్లూరుకు 146 టీఎంసీల సామర్థ్యం కలిగిన సోమశిల, కండలేరు జలాశయాలు ఉండటం ఎన్టీఆర్ పుణ్యమేనన్నారు. ఈ మేరకు ఆయన ఎన్టీఆర్‌తో అప్పట్లో దిగిన ఫొటోను ట్వీట్ చేశారు.