News December 25, 2025
ఉదయగిరి: హనీఫ్ మాస్టర్ ఇక లేరు..!

ఉదయగిరికి చెందిన ‘ఉర్దూ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్’ గ్రహీత షేక్ మహమ్మద్ హనీఫ్ ఖాలిది(77) ఇక లేరు. బుధవారం రాత్రి ఆయన అనారోగ్య సమస్యలతో మృతి చెందారని కుటుంబీకులు తెలిపారు. ఆయన జీవితాంతం ఉర్దూ భాష అభివృద్ధికి ఎనలేని సేవలందించారు. అనేక మంది పేద విద్యార్థులకు ఆర్థికంగా సహాయం అందించారు. ఆయన ఎంతో శ్రమించి రచించిన “ఉదయగిరి మహనీయులు” పుస్తకం విడుదలకు సిద్ధంగా ఉన్న తరుణంలో మృతి చెందడం బాధాకరం.
Similar News
News December 26, 2025
నెల్లూరులో ఆయనో డిఫరెంట్ MLA..?

నెల్లూరు జిల్లాలో తొలిసారి గెలిచిన ఓ MLA తీరును సొంత పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నారు. పార్టీకి ఎప్పటి నుంచో అండగా ఉంటున్న వారిని సైతం దూరం పెట్టేస్తున్నారంట. తాను తప్ప నియోజకవర్గంలో ఎవరూ పెత్తనం చలాయించడానికి లేదని ముఖాన చెప్పేస్తున్నారంట. తనకు గిట్టని వాళ్లను హైలెట్ చేసేలా సొంత పార్టీ నాయకులు ఫ్లెక్సీలు వేసినా ఊరుకోవడం లేదంట. దగ్గరుండి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించిన నేతకు సైతం ఆయన శత్రువుగా మారారట.
News December 26, 2025
నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని సీఎంని కోరా: ఆనం

రాపూరు, కలువాయి, సైదాపురం మండలాలను నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కోరినట్లు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. విభజన నోటిఫికేషన్‌కు సంబంధించి అభ్యంతరాలు తెలియజేయడానికి నేటితో ఆఖరి రోజు కావడంతో ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. నెల్లూరులో మంత్రి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
News December 26, 2025
నెల్లూరు: 104 వాహనాల్లో ఉద్యోగావకాశాలు

జిల్లాలోని 104 వాహనాల్లో డ్రైవర్లు, డేటాఎంట్రీ ఆపరేటర్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. డీఈవోలకు డిగ్రీ, కంప్యూటర్ కోర్సు, డ్రైవర్లకు టెన్త్ పాస్, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అవసరమని చెప్పారు. ఆసక్తి ఉన్నవారు bhspl.in/careers ద్వారా వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. తిరుపతి రుయా ఆసుపత్రిలోని TB జిల్లా కార్యాలయంలో ఈనెల 27, 28 తేదీలలో సంప్రదించాలని కోరారు.


