News March 25, 2025
ఉద్దానంలో ఆకట్టుకున్న ‘ప్రేమ’ పనసకాయ

వజ్రపుకొత్తూరు మండలం బాతుపురం ఉద్దానం గ్రామంలో ఒక పనసచెట్టుకు కాచిన పనసకాయ LOVE ఆకారంలో ఉండటం చూపరులను ఆకట్టుకుంటుంది. గ్రామానికి చెందిన ఒక రైతుకు చెందిన చెట్టుకు ఈ అరుదైన కాయ కాసింది. కాగా ప్రస్తుతం ఈ ఫొటోను గ్రామస్థులు, యువత సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉద్దానంలో ప్రేమ పనస అంటూ ఫొటోను SHARE చేస్తున్నారు.
Similar News
News September 12, 2025
SKLM: మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక

మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు DMHO డాక్టర్ అనిత తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. స్వస్థనారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంపై ఈ నెల 17 నుంచి అక్టోబరు 2 వరకు స్త్రీల ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక వైద్య నిపుణుల సేవలను జిల్లావ్యాప్తంగా వినియోగిస్తామన్నారు.
News September 12, 2025
పెద్దమ్మ కోసం హైదరాబాద్ రైలు ఎక్కిన పలాస బాలుడు

పలాసకు చెందిన ఓ బాలుడు హైదరాబాదులో ఉంటున్న వాళ్ల పెద్దమ్మ ఇంటికి వెళ్లాలనుకున్నాడు. అనుకున్నదే తడువుగా గురువారం పలాస రైల్వే స్టేషన్‌లో విశాఖఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కాడు. గురువారం అర్ధరాత్రికి రైలు గుంటూరు రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. ఒంటరిగా ప్రయాణిస్తున్న బాలుడిని గమనించిన రైల్వే పోలీసులు వివరాలను అడిగగా తనది పలాస అని చెప్పాడు. ఈ బాలుడిని గుంటూరు రైల్వే ఛైల్డ్ హెల్ప్ లైన్ సంరక్షణలో ఉంచారు.
News September 12, 2025
శ్రీకాకుళం: 27 వరకు ప్యాసింజర్ రద్దు

శ్రీకాకుళం జిల్లాలోని పలు స్టేషన్ల మధ్య ట్రాక్ మరమ్మతుల కారణంగా బ్రహ్మపూర్- విశాఖ మధ్య నడిచే ప్యాసింజర్‌ను కొద్ది రోజుల పాటు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. నంబర్ (58531, 58532) గల ట్రైన్‌ను ఈ నెల 15 నుంచి 27 వరకు రద్దు చేస్తున్నామని తూర్పు కోస్తా రైల్వే తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికులు గమనించాలని విజ్ఞప్తి చేసింది.