News August 16, 2025

ఉద్ధృతంగా ప్రవహిస్తున్న ‘కిన్నెరసాని’

image

ఆళ్లపల్లి మండలంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు శనివారం ఉదయం రాయిపాడు గ్రామ సమీపంలో వంతెన వద్ద కిన్నెరసాని వాగు వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. జిల్లా కేంద్రానికి వెళ్లే వాహనదారులు, వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు లో లెవెల్ బ్రిడ్జి దాటాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి. ఇకనైనా ప్రభుత్వం హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Similar News

News August 16, 2025

చిన్నారుట్ల గూడెంలో చిరుతపులి కదలికలపై నిరంతర నిఘా

image

శ్రీశైలం – దోర్నాల మార్గమధ్యంలోని చిన్నారుట్లా గిరిజన గూడెంలో బాలికపై చిరుతపులి దాడి చేసిన ఘటనపై అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. చిరుత కదలికల కోసం అన్ని ప్రాంతాలలో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. చిరుత సంచరించే అవకాశం ఉన్నందున దాని కదలికలను పర్యవేక్షిస్తూ తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు దోర్నాల రేంజర్ హరి పేర్కొన్నారు. చెంచు గిరిజనులతో మాట్లాడి వారికి భరోసా కల్పించారు.

News August 16, 2025

ఆకివీడు: కండక్టర్‌గా మారిన RRR

image

‘స్త్రీ శక్తి’ పథకాన్ని డిప్యూటీ స్పీకర్ RRR శుక్రవారం దుంపగడపలో ప్రారంభించారు. కండక్టర్‌గా మారి, కాసేపు మహిళలకు ఉచిత టికెట్లు ఇచ్చారు. ప్రభుత్వం మహిళాభ్యున్నతికి కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. జిల్లాలో మొత్తం 297 బస్సులకు గాను 225 బస్సులు ఈ పథకంలో సేవలందిస్తున్నాయని, ప్రభుత్వం రూ.2,000 కోట్లు కేటాయించిందని ఆయన వివరించారు.

News August 16, 2025

పెందుర్తిలో అత్యధిక వర్షపాతం నమోదు

image

పెందుర్తిలోని అత్యధికంగా వర్షపాతం నమోదయింది. బంగాళాఖాతంలోని అల్పపీడనం ద్రోణి ప్రభావంతో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పెందుర్తి పరిసర ప్రాంతాల్లోనీ 66.4 మీ.మీ.వర్షపాతం నమోదయింది. పద్మనాభంలో 28.6 మీ. మీ, ఆనందపురం 15.6 మీ.మీ, ములగాడ 8.2 మీ.మీ., గోపాలపట్నం 7.4 మీ. మీ, విశాఖపట్నం రూరల్ 6.8.మీ.మీ వర్షం పడింది. ఇల్లా వ్యాప్తంగా 24 గంటల్లో 162.0 వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.