News May 7, 2024

ఉద్యమంలో పోరాటం చేసిన గడ్డ కామారెడ్డి: KCR

image

తెలంగాణ ఉద్యమంలో బ్రహ్మాండమైన పోరాటం చేసిన గడ్డ కామారెడ్డి అని మాజీ సీఎం KCR అన్నారు. కామారెడ్డిలో ఆయన రోడ్ షో నిర్వహించారు. ఆనాడు కష్టపడి అనేక ఏళ్లు పోరాడి తెలంగాణ తెచ్చుకున్నామన్నారు. BRS పాలనలో రాష్ట్రాన్ని పొదరిల్లులా చేసుకున్నామని పేర్కొన్నారు. ఇదే కామారెడ్డిలో పోలీస్ కిష్టయ్య పిస్టల్‌తో కాల్చుకుని అమరుడయ్యారని గుర్తు చేశారు. ఆలోచించి విజ్ఞతతో ఓటు వేయాలని ప్రజలకు సూచించారు.

Similar News

News September 12, 2025

సాయంత్రం 4 గంటలకు శ్రీరాంసాగర్ గేట్లు ఓపెన్

image

శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి వస్తున్న వరద ప్రవాహాన్ని శుక్రవారం సాయంత్రం 4 గంటల తర్వాత ఏ సమయంలోనైనా స్పిల్‌వే గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేయనున్నట్లు ప్రాజెక్టు ఎస్ఈ జగదీశ్ తెలిపారు. ప్రాజెక్టు దిగువన ఉన్న గోదావరి తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. పశువుల కాపరులు, మత్స్యకారులు, రైతులు నదిని దాటేందుకు ప్రయత్నించవద్దని హెచ్చరించారు.

News September 12, 2025

KMR: యువకుడి మోసం.. యువతి ఆత్మహత్య

image

ప్రేమలో మోసపోయానని మనస్తాపంతో యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఎల్లారెడ్డి మండలం సబ్దల్ పూర్‌లో బుధవారం జరిగింది. ఎస్సై బొజ్జ మహేష్ వివరాలు.. గ్రామానికి చెందిన సావిత్రి(19) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. శెట్టిపల్లి సంగారెడ్డికి చెందిన ప్రదీప్ ప్రేమ పేరుతో మోసం చేశాడని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News September 12, 2025

బోధన్ ఎస్బీఐలో నగదు చోరీ

image

బోధన్ పట్టణంలోని ఎస్బీఐలో చోరీ జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ వెంకటనారాయణ వివరాల ప్రకారం.. ఈ నెల 8వ తేదీన బ్యాంకుకు వచ్చిన వ్యక్తులు రూ.ఐదు లక్షలు డిపాజిట్ చేసి వెళ్లిపోయారు. తరువాత నగదు క్యాషియర్ వద్ద కనిపించలేదు. దీంతో గురువారం బ్యాంకు సిబ్బంది బోధన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బ్యాంకులోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.