News January 29, 2025
ఉద్యోగాలు ఇస్తామని ఫేక్ ఫోన్ కాల్స్ వస్తే నమ్మకండి: DMHO

రాత పరీక్ష రాసినటువంటి అభ్యర్థులకు వైద్య ఆరోగ్యశాఖలో రెగ్యులర్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు ఫోన్ కాల్స్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని హనుమకొండ డీఎంహెచ్‌వో అప్పయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఎవరైనా ఫేక్ కాల్స్‌ను నమ్మి మోసపోవద్దని పేర్కొన్నారు. ఇలాంటి కాల్స్ వచ్చినట్లయితే తమ దగ్గరలోని పోలీస్ స్టేషన్ లేదా సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్ 1930కి కాల్ చేయాలని ఆయన సూచించారు.
Similar News
News November 8, 2025
ఈరోజు మీకు సెలవు ఉందా?

AP: మొంథా తుఫాను సమయంలో పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారికి రెండో శనివారం పాఠశాలలు నిర్వహించాలని DEOలు ఆదేశాలు ఇచ్చారు. దీంతో నేడు విశాఖ, ఏలూరు, బాపట్ల జిల్లాల్లో స్కూళ్లకు సెలవు రద్దు చేశారు. కర్నూలు, నంద్యాల, NTR, కడప, ప.గో, పల్నాడు, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లోనూ పాఠశాలలకు సెలవు రద్దు చేసినట్లు తెలుస్తోంది. మరి మీ ప్రాంతంలో స్కూల్ ఉందా? COMMENT
News November 8, 2025
VJA: ప్రేమ పేరుతో మోసం

చిలకలపూడికి చెందిన మైనర్ బాలికను ప్రేమ పేరుతో మోసం చేసిన అదే గ్రామానికి చెందిన బాలుడు, అతడికి సహకరించిన స్నేహితుడు, స్నేహితుడి కుటుంబ సభ్యులకు విజయవాడ పోక్సో కోర్టు శుక్రవారం రిమాండ్ విధించింది. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ విద్యాసాగర్ స్పందిస్తూ, బాలికలను ప్రేమ పేరుతో వేధించే వారిని సహించేది లేదని హెచ్చరించారు.
News November 8, 2025
నరసన్నపేట: పంచలోహ విగ్రహాల అప్పగింత

నరసన్నపేటలోని సిద్ధాశ్రమంలో ఏడు పంచలోహ విగ్రహాలు చోరీకి గురైన విషయం తెలిసిందే. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ శ్రీనివాసరావు, ఎస్సై దుర్గాప్రసాద్ నిందితుడి వద్ద సమాచారం రాబట్టి, విగ్రహాలను సిద్ధాశ్రమ నిర్వాహకులకు శుక్రవారం రాత్రి అందజేశారు.


