News May 6, 2024

ఉద్యోగులందరూ పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు వినియోగించుకోవాలి: కలెక్టర్

image

భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్‌ విధులు కేటాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని కలెక్టర్‌ హరినారాయణన్‌ పిలుపునిచ్చారు. ఆదివారం కందుకూరులోని‌ బాలికల హైస్కూలులో ఏర్పాటుచేసిన ఫెసిలిటేషన్‌ సెంటర్‌ను సబ్‌ కలెక్టర్‌ విద్యాధరితో కలిసి కలెక్టర్‌ పరిశీలించారు. ఓటింగ్‌ సరళిని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

Similar News

News October 21, 2025

ఇసుక అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపాలి: కలెక్టర్

image

ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని కలెక్టర్ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన అధ్యక్షతన ఒంగోలు క్యాంపు కార్యాలయంలో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇసుక లభ్యత,‌ రవాణా, వర్షాకాలం దృష్ట్యా ముందుగానే ప్రజలకు అవసరమైన స్థాయిలో యార్డుల్లో అందుబాటులో ఉంచడం తదితర అంశాలను గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజశేఖర్ కలెక్టర్‌కు వివరించారు.

News October 21, 2025

ప్రకాశం జిల్లా ‘పోలీస్ సింగం’ ఈయనే.!

image

నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం. ఈ నేపథ్యంలో పలువురు పోలీసు అమరవీరులను స్మరించుకోవాల్సిందే. ప్రకాశం జిల్లాకు చెందిన ఎందరో పోలీస్ అధికారులు, సిబ్బంది విధులు నిర్వహిస్తూ అమరులయ్యారు. వారిలో ఒంగోలుకు చెందిన జాన్ వెస్లీ IPS ఒకరు. ఈయన YS రాజశేఖర్‌రెడ్డి భద్రతా అధికారిగా విధులు నిర్వహించారు. 2009లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో YSRతో సహా జాన్‌వెస్లీ విధినిర్వహణలోనే ప్రాణాలు విడిచారు.

News October 21, 2025

నేడు ఒంగోలులో అమరవీరుల దినోత్సవం.!

image

ఒంగోలులోని పోలీసు పరేడ్ గ్రౌండ్ వద్ద స్మృతి వనంలోని పోలీసు అమరవీరుల స్మారక స్థూపం వద్ద మంగళవారం ఉదయం 7.30 గంటలకు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించనున్నట్లు SP హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అమరవీరులకు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు నివాళులు అర్పించనున్నారని చెప్పారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో పోలీస్ అమరవీరుల త్యాగాలు అజరామరం అని పేర్కొన్నారు.