News May 7, 2024

ఉద్యోగులకు సీఎం జగన్ మేలు చేశారు: చంద్రశేఖర్ రెడ్డి

image

సీఎం జగన్ ఉద్యోగులకు మేలు చేశారని ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సలహాదారు ఎన్.చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం లాసన్స్ బేకాలనీలో గల బొత్స ఝాన్సీ ఎన్నికల కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులకు టీడీపీ హయాంలో ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని, వైసీపీ మేనిఫెస్టోలో 40శాతం ధరకే ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ప్రకటించారన్నారు. రెండు డీఏలు జూన్, జూలై లోపు ఇస్తున్నారని, 11 పీఆర్సీ కింద ఐఆర్ 20 శాతం ప్రకటించారని చెప్పారు.

Similar News

News January 24, 2025

పాయకరావుపేటలో ఎయిర్ పోర్ట్‌కు ప్రతిపాదనలు

image

పాయకరావుపేటలో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ముందు తుని-అన్నవరం మధ్య ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. ఆ ప్రాంతం అనుకూలం కాదని ఆ ప్రతిపాదనను విరమించుకున్నట్లు సమాచారం. పాయకరావుపేట ప్రాంతంలో విస్తారంగా ప్రభుత్వ భూములు ఉండడంతో నిర్మాణానికి అన్ని విధాల అనుకూలమని ప్రభుత్వం భావిస్తోంది. అధికారులు భూముల వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.

News January 24, 2025

విశాఖ పోలీసుల అదుపులో నకిలీ మహిళా ఐఏఎస్..!

image

ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురు వద్ద డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ మహిళాIASతో పాటు ఆమె భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అమృత భాగ్యరేఖ అనే మహిళ MVPకాలనీలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో ఇంటి యజమానికి అనుమానం వచ్చి విశాఖCPకి ఫిర్యాదు చేశారు. సీపీ ఆదేశాలతో పోలీసులు విచారించగా ఆమె నకిలీ IASగా నిర్ధారణ అయింది.

News January 24, 2025

కొత్తపల్లి జలపాతం నాలుగు రోజులు మూసివేత

image

జీ.మాడుగుల మండలంలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన కొత్తపల్లి జలపాతాన్ని ఈనెల 24 నుంచి 27 వరకు మూసివేస్తున్నట్లు ఐటీడీఏ పీవో అభిషేక్ గురువారం తెలిపారు. జనవరి 24వ తేదీ నుంచి 27 వరకు జలపాతం ఆధునీకరణ పనులు జరుగుతున్నందున ఎవరికి ప్రవేశం లేదని చెప్పారు. ఈ విషయాన్ని గమనించి పర్యాటకులు కొత్తపల్లి జలపాతం సందర్శించవద్దని అభిషేక్ పేర్కొన్నారు.