News July 21, 2024

ఉద్యోగుల బదిలీలు పారదర్శకంగా నిర్వహిస్తాం: కలెక్టర్

image

సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగుల బదిలీలు పారదర్శకంగా నిర్వహిస్తామని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో టీఎన్జీవో ప్రతినిధులతో శనివారం సమావేశం నిర్వహించారు. బదిలీలకు ఉద్యోగులు సహకరించాలని కోరారు. సమావేశంలో టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు జావీద్ అలీ, కార్యదర్శి రవి, అసోసియేట్ అధ్యక్షులు శ్రీకాంత్, వెంకట్ రెడ్డి, కోశాధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు.

Similar News

News August 20, 2025

మెదక్: ‘మళ్లీ జైలుకు రావొద్దు’

image

మెదక్ సబ్ జైలును జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ ఆర్.ఎం.సుభవల్లి తనిఖీ చేశారు. ఖైదీలకు అందుతున్న వసతులు, వారి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. న్యాయ సలహాలు ఇచ్చారు. మీరు తప్పులు చేసి జైలుకు వస్తే మీ వల్ల మీ కుటుంబం ఇబ్బందులకు గురవుతుంది. మానసికంగా క్షోభకు గురవుతారన్నారు. కావున ఒకసారి జైలు నుంచి బయటకు వెళ్లాక సత్ప్రవర్తనతో మెలగాలని, మళ్లీ తప్పులు చేసి జైలుకు రావొద్దని సూచించారు.

News August 20, 2025

MDK: ఎల్లలు దాటినా.. ఏడుపాయల కీర్తి

image

మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గమ్మ ప్రధాన ఆలయం 7వ రోజు బుధవారం సైతం జలదిగ్బంధంలోనే చిక్కుకుంది. భారీ వర్షాలతో వనదుర్గా ప్రాజెక్ట్ పొంగి పొర్లుతుంది. ఉదయం రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా 1965-1966లో ఈ ఆలయం దేవాదాయ శాఖ అధీనంలోకి వెళ్లింది. దేశంలో రెండో వనదుర్గమ్మ ఆలయం ఏడుపాయల కావడం విశేషం. దీంతో ఏడుపాయల కీర్తి ఎల్లలు దాటింది.

News August 20, 2025

మెదక్: తగ్గిన వర్షం.. కురిసింది 3 సెంమీలలోపే

image

మెదక్ జిల్లాలో వర్షం కాస్త తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా పాపన్నపేట మండలం లింగాయపల్లిలో 29.5 మిమీల వర్షపాతం నమోదయింది. రాజుపల్లిలో 27.5, చిన్న శంకరంపేటలో 25, మాసాయిపేటలో 23.8, చేగుంటలో 21.8, మెదక్‌లో 18.8, దామరంచలో 16.8, కొల్చారంలో 16.5, రామాయంపేటలో 15.8 మిమీల వర్షం మాత్రమే కురిసింది.