News August 22, 2025
ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తాం: జిల్లా కలెక్టర్

ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ శ్రీధర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రతినెలా మూడవ శుక్రవారం ఉద్యోగుల గ్రీవెన్స్ డేను నిర్వహించామన్నారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పారదర్శకంగా పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రాజేంద్రన్, DRDO మధుసూదన్ పాల్గొన్నారు.
Similar News
News April 14, 2026
గాఢ సేంద్రియ ఎరువులతో ఎక్కువ లాభం

స్థూల సేంద్రియ ఎరువుల కంటే నత్రజని, భాస్వరం, పొటాష్ వంటి పోషకాలను ఎక్కువగా కలిగి ఉండి నేలకు ఎక్కువ ప్రయోజనం కలిగిస్తాయి. ఉదాహరణ: కొబ్బరి పిండి, నువ్వుల పిండి, వేరుశనగ పిండి, ఆముదపు పిండి, కానుగ పిండి, పత్తి గింజల పిండి, చేపల పొట్టు, ఎముకల పొడి, కొమ్ముల పొడి, వర్మి కంపోస్టు మొదలైనవి. వీటి కొనుగోలు కాస్త ఖర్చుతో కూడుకున్నదైనా నిపుణుల సూచనల మేరకు వీటిని వినియోగిస్తే మంచి దిగుబడి పొందే అవకాశం ఉంది.
News April 14, 2026
నంద్యాల-గిద్దలూరు రోడ్డులో లారీ-బస్సు ఢీ

నంద్యాల – గిద్దలూరు రోడ్డు మార్గంలోని దొరబావి వంతెన వద్ద మంగళవారం లారీ, ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ప్రమాద సూచిక బోర్డులు లేకపోవడం వల్లే ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు ఆరోపిస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి నివారణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
News April 14, 2026
అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలి: కలెక్టర్ ప్రతిమా సింగ్

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డా. బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆశయాలను కొనసాగించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తాలో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలనునిర్వహించారు. కలెక్టర్, ఎస్పీ శ్రీనివాస్ రావుతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.


