News September 19, 2025

ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కారించాలి: కలెక్టర్

image

ఉద్యోగుల వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని అనకాపల్లి కలెక్టరు విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. తన కార్యాలయలో ప్రభుత్వ ఉద్యోగుల వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి శుక్రవారం గ్రీవెన్స్ నిర్వహించారు. పలువురు ఉద్యోగులు తమ సమస్యలను తెలియజేస్తూ అర్జీలు అందజేశారు. న్యాయమైన, పరిష్కరించుటకు అవకాశం గల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

Similar News

News September 19, 2025

భూపాలపల్లిలో రేపు మినీ జాబ్ మేళా

image

భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బస్టాండ్ పక్కన గల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి శ్యామల తెలిపారు. ఏయూ స్మాల్ ఫైనాన్స్ ప్రైవేట్ బ్యాంకులో 30 ఉద్యోగాలకు ఉ.11 గం.కు జాబ్ మేళా నిర్వహిస్తారన్నారు. ఆసక్తి గల నిరుద్యోగ యువత సంబంధిత అర్హత సర్టిఫికెట్లతో హాజరై అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News September 19, 2025

వాడపల్లి వచ్చే భక్తులు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు

image

కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో రేపు శనివారం సందర్భంగా భక్తుల తాకిడి అధికంగా ఉంటుందనే ముందస్తు అంచనాలతో దేవస్థానం భక్తుల సౌకర్యార్థం పలు ఏర్పాట్లు చేసింది. క్యూ లైన్‌లు, మెడికల్ క్యాంపుల ఏర్పాటు, తాగునీటి సౌకర్యం, మాడవీధుల్లో ఫ్యాన్లు, పార్కింగ్, టాయిలెట్లు సౌకర్యం తదితర సౌకర్యాల కల్పనను శుక్రవారం డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు పర్యవేక్షించారు.

News September 19, 2025

సంగారెడ్డి: మెరిట్ జాబితా విడుదల: డీఈవో

image

కేజీబీవీలో తాత్కాలిక పద్ధతిగా పనిచేసేందుకు ఏఎన్ఎం అకౌంటెంట్ మెరిట్ జాబితాను విడుదల చేసినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. జాబితా www.sangareddy.telangana.gov.inలో వచ్చినట్లు చెప్పారు. జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే 22లోపు ఆధారాలతో సమగ్ర శిక్ష కార్యాలయంలో సమర్పించాలని పేర్కొన్నారు.