News August 30, 2025

ఉద్యోగ మేళాను సందర్శించిన DIEO

image

హనుమకొండ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహ సమీపంలో ఏర్పాటు చేసిన ఉద్యోగ మేళాను DIEO శ్రీధర్ సుమన్ సందర్శించారు. ఉద్యోగమేళాలో భాగంగా వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఇంటర్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించి, ఇంటర్వ్యూ, ఇతర పరీక్షలను నిర్వహించారు. ఉద్యోగ మేళాను విద్యార్థులు, యువత సద్వినియోగం చేసుకోవాలని DIEOఅన్నారు.

Similar News

News August 31, 2025

కరీంనగర్: స్థానిక పోరు ప్రచారానికి సమయం లేదు మిత్రమా..!

image

స్థానిక సంస్థల ఎన్నికలకు TG కేబినెట్ శనివారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్డినెన్సు ద్వారా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించి, SEP మొదటి వారంలో నోటిఫికేషన్ జారీ చేసి, నెలాఖరులోపు ఎన్నికల పూర్తికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఆశావాహుల ఎన్నికల ప్రచారానికి సమయం చాలా తక్కువగా ఉంది. ఇలా ఐతే ఖర్చు తగ్గుతుందని అభ్యర్థుల ఆశాభావం. ఉమ్మడి జిల్లాలో 1216 పంచాయతీలు, 60 జడ్పీటీసీ, 646 ఎంపీటీసీ స్థానాలున్నాయి.

News August 31, 2025

KNR: వచ్చే నెలలోనే స్థానిక పోరు.. అన్ని ఏర్పాట్లు చేసిన జిల్లా యంత్రాంగం

image

స్థానిక ఎన్నికలను SEP 30లోపు పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించగా, సర్కారు వచ్చే నెలలో పూర్తి చేసేందుకు సిద్ధం చేసింది. రిజర్వేషన్ల సీలింగ్ ను ఎత్తివేసి, 42% రిజర్వేషన్ల అమలుకు క్యాబినెట్ తీర్మానించి ఎన్నికల నిర్వహణకు ECకి లేఖను కూడా పంపింది. ఇప్పటికే బ్యాలెట్ పేపర్లు, ఓటర్ లిస్ట్ ఇలా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను చేసింది. ఉమ్మడి జిల్లాలో 1216 పంచాయతీలు, 60 జడ్పీటీసీ, 646 ఎంపీటీసీ స్థానాలున్నాయి.

News August 31, 2025

బీర్పూర్: కుక్కల దాడిలో గాయపడిన బాలుడు.. చికిత్స పొందుతూ మృతి

image

బీర్పూర్ మండలం తుంగూరు గ్రామానికి చెందిన ఇంద్రాల రక్షిత్ అనే 3డు సంవత్సరాల బాలుడిని ఇటీవల కుక్కలు దాడి చేయడంతో గాయాల పాలయ్యాడు. బాలుడిని మొదట జగిత్యాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందించగా, మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి కరీంనగర్ తరలించారు. మళ్లీ అక్కడి నుంచి సిద్దిపేటకు తరలించి చికిత్స అందించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు శనివారం ఉదయం మరణించాడు. బాలుడి మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయ