News April 15, 2025
ఉద్యోగ విరమణ పొందిన హోంగార్డుకు సీపీ సన్మానం

ఖమ్మం: ఉద్యోగ విరమణ పొందిన సత్తుపల్లి యూనిట్ హోంగార్డు ఆఫీసర్ మిట్టపల్లి వాణిని మంగళవారం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పూలమాలలు, శాలువాతో ఘనంగా సన్మానించారు. సుదీర్ఘ కాలంగా వివిధ విభాగాలలో బాధ్యతాయుతమైన విధులు నిర్వహించి పోలీస్ శాఖకు ఎనలేని సేవలతో పోలీస్ అధికారుల మన్ననలు పొందారని సీపీ కొనియాడారు. ఇకపై కుటుంబ సభ్యులతో ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు.
Similar News
News April 18, 2025
సభ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎమ్మెల్యే, ఎస్పీ

థరూర్ మండల కేంద్రంలో రేపు భూభారతి చట్టం అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రానున్నారు. సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, జిల్లా ఎస్పీ శ్రీనివాస రావులతో కలిసి జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ పరిశీలంచారు. ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
News April 18, 2025
IPL: ఆగని వర్షం.. టాస్ ఆలస్యం

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో వర్షం కొనసాగుతోంది. దీంతో 7 గంటలకు పడాల్సిన టాస్ వాయిదా పడింది. మ్యాచ్ కూడా కొంత ఆలస్యంగా మొదలయ్యే అవకాశం ఉంది. లేట్‌గా స్టార్ట్ అయినా మధ్యలో వర్షం రాకపోతే పూర్తి 40 ఓవర్ల ఆట యథావిధిగా జరుగుతుంది.
News April 18, 2025
నెల్లూరు: ఒకేసారి రూ.5వేలు పెరిగిన ధర

నెల్లూరు జిల్లాలో కొంతమేర నిమ్మ ధరలు పెరిగాయి. పొదలకూరు మార్కెట్‌లో లూజు బస్తా శుక్రవారం రూ.7వేల నుంచి రూ.9వేలు పలికింది. మంచు ప్రభావం తగ్గి వేసవితాపం పెరగడంతో ఢిల్లీలో మార్కెట్ ఊపందుకుంది. 15 రోజుల కిందట రూ.4,500 ఉన్న ధర ఒకేసారి రూ.5 వేలు పెరిగి రూ.9వేలకు చేరింది. దీంతో రైతులు చెట్లకు ఉన్న కాయలు జాగ్రత్తగా కోసి మార్కెట్‌కు తరలిస్తున్నారు. చెన్నై, బెంగళూరు, కేరళకు తరలిస్తున్నారు.