News December 18, 2025

ఉద్రిక్తతకు దారితీసిన కాంగ్రెస్ నిరసన

image

TG: సోనియా, రాహుల్ గాంధీపై బీజేపీ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ కాంగ్రెస్ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. HYDలో BJP ఆఫీస్‌ ముట్టడికి బయల్దేరిన మహిళా నేతలను గాంధీభవన్ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. దీంతో మహిళా నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అటు కరీంనగర్‌, నిజామాబాద్, వరంగల్‌లో ఆందోళనకు దిగిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను పోలీసు సిబ్బంది అడ్డుకుంటున్నారు.

Similar News

News December 22, 2025

కొత్త పథకాలపై ప్రభుత్వం కసరత్తు

image

TG: వచ్చే బడ్జెట్లో మరో 5 కొత్త పథకాలను ప్రకటించేలా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ఆయా విభాగాల నుంచి ప్రతిపాదనలను రప్పిస్తోంది. నిరుద్యోగులు, మహిళలు, విద్యార్థులు, యువతను దృష్టిలో పెట్టుకొని వీటికి రూపకల్పన చేయిస్తోంది. ఈ పథకాలకు ఆర్థిక వనరుల లభ్యతపై ఆర్థిక శాఖ కసరత్తు చేపట్టింది. కాగా ఎన్నికల హామీ అయిన పెన్షన్ పెంపుపై ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

News December 22, 2025

పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థిని ఆత్మహత్య

image

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ జిల్లాలోని ఒక యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతున్న ప్రిన్సీ కుమారి (20) ఆత్మహత్య చేసుకుంది. ఝార్ఖండ్‌కు చెందిన ఆమె బీటెక్ సెకండ్ ఇయర్(CSE) చదువుతూ హాస్టల్‌లో ఉంటోంది. బ్యాక్‌లాగ్‌లు ఉండటంతో పరీక్షల ఒత్తిడి కారణంగా తీవ్ర మానసిక ఆందోళనకు గురైనట్లు సమాచారం. ‘సారీ మమ్మీపప్పా.. మీ అంచనాలు అందుకోలేకపోతున్నా. బాధగా ఉంది. చనిపోతున్నా’ అంటూ సూసైడ్ నోట్ రాసింది.

News December 22, 2025

మినుము, పెసర విత్తాక కలుపు నివారణ ఎలా?

image

మినుము, పెసరలో కలుపు నివారణకు విత్తిన వెంటనే లేదా 1,2 రోజులకు నేల తేమగా ఉన్నప్పుడు ఎకరానికి 200లీ. నీటిలో పెండిమిథాలిన్ 30% 1 లీటరు లేదా అలాక్లోర్ 50% 1.5లీటరు కలిపి పిచికారీ చేసి తొలిదశలో కలుపు నివారించవచ్చు. వరి మాగాణుల్లో విత్తిన మినుము, పెసరలో తొలిదశలో కలుపు నివారణకు వరి పనలు తీసిన వెంటనే ఎకరానికి 20KGల ఇసుకలో పెండిమిథాలిన్ 30% 1.25L కలిపి చల్లాలి తర్వాత 200 లీటర్లు నీరు పిచికారీ చెయ్యాలి.