News December 4, 2024

ఉన్నతాధికారులతో నెల్లూరు కమిషనర్ భేటీ

image

నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో వివిధ అభివృద్ధి పనులను చేపట్టేందుకు మెట్రో నగరాల అధ్యయనంలో భాగంగా కమిషనర్ సూర్యతేజ హైదరాబాదులోని వివిధ విభాగాల ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. మంగళవారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కూకట్ పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహన్‌ను కమిషనర్ కలుసుకున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థపై చర్చించారు.

Similar News

News December 4, 2024

అల్లూరు: దెయ్యం పేరుతో బురిడీ

image

అల్లూరు మండలంలో ముగ్గురు వ్యక్తులు ఓ స్వామి మాల ధరించి ఒక వ్యక్తి దగ్గర నుంచి బంగారు నగలు అపహరించారు. అమాయక ప్రజలే టార్గెట్‌గా చేసుకొని ఇంట్లో దెయ్యం ఉందని నమ్మించారు. పూజలు చేస్తే దెయ్యం వెళ్లిపోతుందన్నారు. అనంతరం బాధితుడి నుంచి బంగారు నగలు అపహరించుకొని వెళ్లిపోయారు. దీంతో బాధితుడు స్థానిక అల్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

News December 4, 2024

మత్స్యకారుల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలేంటి: ఎంపీ వేమిరెడ్డి

image

దేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మత్స్యకారుల సంక్షేమానికి కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వివరించాలని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి బుధవారం కోరారు. లోక్‌సభలో ఆయన మత్స్యకారుల సంక్షేమానికి సంబంధించి పలు ప్రశ్నలు వేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మత్స్యకారుల నైపుణ్యాభివృద్ధికి, శిక్షణ అందించడానికి ప్రభుత్వం ఏదైనా పథకాలను అమలు చేస్తుందా అని ప్రశ్నించారు.

News December 4, 2024

కొండాపురం; 30 మంది సచివాలయం సిబ్బందికి మెమోలు

image

కొండాపురం మండలంలో పనిచేసే 30 మంది సచివాలయం సిబ్బందికి ఎంపీడీవో ఆదినారాయణ బుధవారం మెమోలు ఇచ్చారు. దీంతో సచివాలయ ఉద్యోగుల్లో కలకలం రేగింది. సచివాలయాల్లో తనిఖీలు నిర్వహించిన ఎంపీడివో పలు విషయాలను గుర్తించినట్లు తెలిపారు. మెమోలిచ్చిన వారంతా సచివాలయాల విధులకు సక్రమంగా హాజరు కావడం లేదని గుర్తించినట్లు పేర్కొన్నారు. వీరు ఇదేవిధంగా ప్రవర్తిస్తే ఉన్నతాధికారులకు తెలిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు.