News April 3, 2026

ఉపరాష్ట్రపతితో బీఆర్‌ఎస్‌ ఎంపీల భేటీ

image

ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌ రాధాకృష్ణన్‌ను బీఆర్‌ఎస్‌ ఎంపీలు మర్యాదపూర్వకంగా కలిశారు. పార్లమెంటరీ పార్టీ నేత కె.ఆర్‌.సురేష్‌ రెడ్డి, ఉపనేత వద్దిరాజు రవిచంద్ర, విప్‌ దీవకొండ దామోదర్‌ రావు గురువారం ఆయన ఛాంబర్‌కు వెళ్లి శాలువాతో సన్మానించారు. అనంతరం రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్ నారాయణ సింగ్‌ను కలిసి పలు అంశాలపై ఇష్టాగోష్టిగా చర్చించారు.

Similar News

News April 20, 2026

KMM: మొక్కజొన్న కొనుగోళ్లపై కలెక్టర్లకు మంత్రి తుమ్మల ఆదేశాలు

image

మొక్కజొన్న కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చోట అదనపు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మార్క్‌ఫెడ్ ద్వారా 200 కేంద్రాల్లో కొనుగోళ్లు కొనసాగుతున్నాయని తెలిపారు. కొనుగోలు చేసిన మొక్కజొన్నను వెంటనే గోదాములకు తరలించేలా చర్యలు తీసుకోవాలని మార్క్‌ఫెడ్ అధికారులను సూచించారు.

అందుబాటులోకి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే

image

జిల్లా ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే (ప్యాకేజీ-2) సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. వైరా మండలంలోని సోమవరం ఎగ్జిట్ పాయింట్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని దేవరపల్లి వరకు నిర్మించిన ఈ రహదారిని అధికారులు ప్రారంభించారు. నేటి నుంచి టోల్ వసూళ్లు మొదలయ్యాయి. కాగా, ఈ రహదారిపై ద్విచక్ర వాహనాలు, ఆటోలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.