News December 27, 2025

ఉపవాసంలో ఉపశమనం కోసం..

image

ఉపవాస సమయంలో అలసట రాకుండా ఉండాలంటే సగ్గుబియ్యం, పన్నీర్ వంటి ఆహారాలు తీసుకోవడం ఉత్తమం. తాజా పండ్లు, డ్రై ఫ్రూట్స్ సహజ సిద్ధమైన శక్తిని ఇస్తాయి. శరీరంలో నీటి శాతం తగ్గకుండా పాలు, పెరుగు, కొబ్బరి నీళ్లు తీసుకోవడం చాలా అవసరం. తక్కువ ఉప్పు, తక్కువ నూనెతో చేసిన వంటకాలు ఆరోగ్యానికి మంచివి. ఇటువంటి మితమైన, పోషకాలున్న ఆహారం తీసుకోవడం వల్ల శక్తి కోల్పోకుండా ఉపవాసాన్ని విజయవంతంగా పూర్తి చేయవచ్చు.

Similar News

News January 4, 2026

విజయ్ ‘జన నాయకుడు’ రిలీజ్‌కు అడ్డంకులు!

image

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘జన నాయకుడు’ మూవీ జనవరి 9న రిలీజ్ అవుతుందంటూ మేకర్స్ ప్రకటించినా ఇప్పటివరకూ సెన్సార్ సర్టిఫికెట్ రాలేదని తెలుస్తోంది. “సెన్సార్ బోర్డు కొన్ని రోజుల క్రితం U/A సర్టిఫికెట్‌ను సిఫార్సు చేసింది. కానీ ఇప్పటివరకు ఇవ్వలేదు” అని TVK డిప్యూటీ జనరల్ సెక్రటరీ CTR నిర్మల్ కుమార్ అన్నారు. సినిమాను ఆపడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అడ్డంకులను అధిగమిస్తామని తెలిపారు.

News January 4, 2026

భర్తను చంపేందుకు భార్య సుపారీ.. తర్వాత ట్విస్ట్

image

TG: నిజామాబాద్(D) బోర్గాంలో దారుణం జరిగింది. దిలీప్ అనే వ్యక్తి మోజులో భర్త రమేశ్‌ను భార్య సౌమ్య చంపాలనుకుంది. అందుకు సుపారీ గ్యాంగ్‌కు రూ.35వేలు ఇచ్చింది. అయితే డబ్బులు తీసుకున్నాక ఆ గ్యాంగ్ సౌమ్య ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. దీంతో ఆమె దిలీప్‌తో కలిసి ఇంట్లో నిద్రపోతున్న భర్త గొంతునులిమి హత్య చేసింది. విచారణలో అసలు విషయం బయటపడింది. సౌమ్య, దిలీప్, సుపారీ గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

News January 4, 2026

AIతో ఈ విషయాలు షేర్ చేయొద్దు

image

ప్రస్తుతం ChatGPT, Gemini, Grok వంటి AI చాట్‌బాట్‌ల వినియోగం వేగంగా పెరుగుతోంది. అయితే కొన్ని విషయాలను వీటితో పంచుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ సమాచారం, పాస్‌వర్డ్‌లు, ఆఫీస్ సీక్రెట్‌లను షేర్ చేయకూడదు. అలాగే వైద్య, చట్టపరమైన సలహాల కోసం AIపై ఆధారపడటం ప్రమాదకరం. ఏఐ కరెక్ట్ సమాచారం చెప్పకపోవచ్చు కాబట్టి కీలక నిర్ణయాలకు దీనిని ఉపయోగించకూడదు.