News March 26, 2025

ఉపసర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి: జేసీ

image

జిల్లాలో 12 గ్రామాలలో ఈ నెల 27న ఉప సర్పంచ్‌ల, బిక్కవోలు మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు, పెరవలి, రంగంపేటల రెండు కో-ఆప్షన్ సభ్యుల పరోక్ష ఎన్నికల ప్రక్రియను సజావుగా నిష్పక్షపాతంగా నిర్వహించాలని, ఆ మేరకు అధికారులు బాధ్యతతో వ్యవహరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు స్పష్టం చేశారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో సమన్వయ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు.

Similar News

News March 27, 2025

తానేటి వనితకు వైసీపీ అదిష్ఠానం మరో బాధ్యత

image

రాష్ట్ర మాజీ హోంమంత్రి, గోపాలపురం నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ తానేటి వనితకు వైసీపీ అదిష్ఠానం మరో బాధ్యతను అప్పగించింది. ‘పార్టీ క్రమ శిక్షణ కమిటీ’లో సభ్యురాలిగా ఆమెను నియమిస్తూ బుధవారం వైసీపీ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఐదుగురు సభ్యులతో కూడిన ఈ కమిటీలో శెట్టిపల్లి రఘురామి రెడ్డి, రెడ్డి శాంతి, కైలే అనీల్ కుమార్, విశ్వేశ్వర రెడ్డిలు ఉన్నారు.

News March 26, 2025

రాజమండ్రి: సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం తేదీ మార్పు

image

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు శాసనమండలి సభ్యునిగా ప్రమాణస్వీకార కార్యక్రమంలో తేదీ మార్పు జరిగినట్లు బుధవారం రాజమండ్రిలో ఒక ప్రకటన ద్వారా తెలిపారు. గతంలో తెలిపిన విధంగా ఏప్రిల్ 3వ తేదీకి బదులుగా 2వ తేదీకి మార్చినట్లు వెల్లడించారు. కావున పార్టీ నాయకులు, కార్యకర్తలు గమనించాలని కోరారు. ఏప్రిల్ 2వ తేదీ ఉదయం 10 గంటలకి అమరావతిలో శాసనమండలి వద్ద ప్రమాణ స్వీకారం జరుగుతుందన్నారు.

News March 26, 2025

రాజమండ్రి: పాస్టర్ మరణంపై ప్రభుత్వం విచారణకు ఆదేశం

image

పాస్టర్ పగడాల ప్రవీణ్ మరణంపై రాజమండ్రి ఆసుపత్రి ఎదుట తీవ్రస్థాయిలో ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ బుధవారం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, సంతాపం తెలిపారు. ఆయన మరణంపై వ్యక్తమవుతున్న అనుమానాలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. ఈ అంశంపై.. ఎవరూ రాజకీయంగా, విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరించొద్దని కోరారు.

error: Content is protected !!