News July 19, 2024
ఉపాద్యాయుల సమయపాలన పాటించాలి: విద్యాశాఖ డైరెక్టర్

ఉపాధ్యాయులు తప్పనిసరిగా సమయపాలన పాటించాలని విద్యాశాఖ డైరెక్టర్ నరసింహరెడ్డి అన్నారు. శుక్రవారం మాగనూర్ మండలం మందిపల్లిలో పాఠశాలను అదనపు కలెక్టర్ మయంక్ మిట్టల్‌తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామస్థులతో మాట్లాడారు. 180 మంది విద్యార్థులకు కేవలం ఒక్కరే టీచర్ ఉన్నారని దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
Similar News
News August 19, 2025
MBNR: ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వద్దు.. మట్టి వినాయకులే ముద్దు

నీటిని కలుషితం చేసి జలచరాలకు హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ పారిస్(POP) విగ్రహాలకు బదులుగా.. మట్టి వినాయకులే ప్రతిష్ఠించేందుకు ఉమ్మడి పాలమూరు జిల్లాలో పలువురు సిద్ధమయ్యారు. ఈనెల 27 నుంచి వినాయక చవితి ప్రారంభం కానుంది. వినాయక మండపాలను సిద్ధం చేసేందుకు సన్నహాలు చేస్తున్నారు. రోజురోజుకు పర్యావరణాన్ని కాపాడేందుకు మట్టి గణపతి విగ్రహాలపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. మరి మీరేమంటారు. కామెంట్?
News August 19, 2025
MBNR: 340 ఉద్యోగాలు.. సద్వినియోగం చేసుకోండి

MBNRలోని ITI(BOYS) కాలేజ్‌లో ఆర్గనైజ్డ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్, ట్రైనింగ్ విత్ నిర్మాణ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈనెల 21న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారిణి మైత్రి ప్రియ Way2Newsతో తెలిపారు. 8 ప్రైవేట్ సంస్థలలో 340 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయన్నారు. SSC, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ITI ఉత్తీర్ణులై ఉండాలని, వయస్సు 18-30లోపు ఉండాలని, ఆధార్ సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు.
News August 19, 2025
పాలమూరు: Sep నుంచి రేషన్ పంపిణీ

ఉమ్మడి MBNR జిల్లాలో కొత్త, పాత రేషన్ కార్డు లబ్ధిదారులకు సెప్టెంబర్ 1 నుంచి ప్రజా పంపిణీ కేంద్రాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేసేందుకు పౌరసరఫరాల శాఖ సన్నహాలు చేస్తుంది. సెప్టెంబర్ నెల కోటా బియ్యాన్ని రాష్ట్రస్థాయి గోదాముల నుంచి మండల లెవెల్ స్టాక్ పాయింట్లకు తరలించే ప్రక్రియను ముమ్మరం చేసింది. ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభమైంది. సన్న బియ్యం తీసుకెళ్లే లబ్దిదారులకు సంచులు ఉచితంగా పంపిణీ చేయనుంది.