News January 7, 2025
ఉపాధిహామీ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: కలెక్టర్ ఆనంద్

ప్రతిరోజూ లక్ష పనిదినాలు లక్ష్యంగా ఉపాధిహామీ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ ఒ.ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ హాల్లో ఉపాధిహామీ, ఆర్‌డబ్ల్యుఎస్, హౌసింగ్, పంచాయతీ రాజ్ సీసీ రోడ్ల గ్రౌండింగ్, ఎంఎస్‌ఎంఈ సర్వే, ఎస్టీలకు ఆధార్‌కార్డుల జారీ, పిఎం సూర్యఘర్ యోజన పథకం అమలు మొదలైన అంశాలపై అధికారులతో మాట్లాడారు.
Similar News
News February 21, 2026
కావలి: రైలు కింద పడి వ్యక్తి మృతి

బిట్రగుంట – అల్లూరు రోడ్డు మధ్యలో శుక్రవారం రాత్రి సుమారు 50-55 ఏళ్ల వయస్సు కలిగిన గుర్తు తెలియని వ్యక్తి గూడ్స్ రైలు కింద పడి మృతి చెందాడు. మృతుడు బూడిద రంగు అర చేతుల చొక్క, నల్లని ప్యాంటు ధరించి ఉన్నాడు. మృతుని వివరాలు తెలిసినవారు కావలి GRP పోలీసులను సమాచారం అందించాలని కోరారు.
News February 21, 2026
నెల్లూరు: ఫేస్‌బుక్ పరిచయం.. ప్రాణం తీసుకున్న యువకుడు

ఫేస్‌బుక్ పరిచయం ఓ యువకుడి ప్రాణాన్ని తీసింది. నెల్లూరు జిల్లాకు చెందిన అశోక్(26)కు కర్నూలు(D) పత్తికొండకు చెందిన దంపతులు FBలో పరిచయమయ్యారు. చెన్నైలో తనకు హోటల్ ఉందని, కర్నూలులో పెట్టే హోటల్‌లో భాగస్వాములు కావాలని ఆ దంపతులకు చెప్పాడు. పత్తికొండకు వెళ్లి అక్కడ ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. అనంతరం ఆమెపైనే కన్నేసిన తనతో రావాలంటూ వేధించగా నిరాకరించింది. దీంతో మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
News February 21, 2026
రోడ్డు ప్రమాదంలో నెల్లూరు యువకుడి దుర్మరణం

తిరుపతి జిల్లా చంద్రగిరి ఫ్లైఓవర్‌పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు దుర్మరణం చెందాడు. ఒక గుర్తు తెలియని వాహనం బైక్‌ను బలంగా ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని నెల్లూరు పొదలకూరు రోడ్డు నేతాజీనగర్‌కు చెందిన రోషన్ కుమార్ (25)గా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.


