News January 23, 2026
ఉపాధి కోసం ఖతార్ వెళ్లిన అల్లవరం మహిళ మృతి

ఉపాధి కోసం ఖతార్‌కు వెళ్లిన అల్లవరం మండలం కొమరగిరిపట్నం గ్రామానికి చెందిన రొక్కాల పద్మ (49) అనారోగ్యంతో మృతి చెందారు. గత కొన్నేళ్లుగా ఖతార్‌లో హౌస్‌మేడ్‌గా పనిచేస్తున్న ఆమె, రెండు వారాలుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 19న మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతదేహం ఆదివారం స్వగ్రామానికి చేరనుందని, పద్మకు ఇద్దరు కుమార్తెలు ఉన్నట్లు తెలిపారు.
Similar News
News February 14, 2026
స్టైలింగ్ ఇలా మార్చుకోండి

చాలామంది అమ్మాయిలు ఫేస్ చేసే సమస్య ఎన్ని దుస్తులున్నా వేసుకోవడానికి ఏవీ లేవనేది వారి బాధ. కొత్త బట్టలు కొనకుండా స్టైలింగ్ కాస్త మారిస్తే మీ వార్డ్‌రోబ్ కొత్తగా కనిపిస్తుంది. ఉన్నవాటినే రంగులూ, డిజైన్ల వారీగా మిక్స్ అండ్ మ్యాచ్ వేసుకోవచ్చు. ట్రెండీ దుస్తులు కాకుండా మీ ఒంటి తీరుకు ఏవి నప్పుతాయో చూసుకోండి. మీకంటూ ఓ స్టైల్ స్టేట్మెంట్ క్రియేట్ చేసుకోండి. అప్పుడే మీరేం వేసినా అందంగా కనిపిస్తారు.
News February 14, 2026
స్టే.ఘ: పదిలో ఒక్కడు!

స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీకి ఈనెల 11న ఎన్నికలు జరగగా, శుక్రవారం ఓట్ల లెక్కింపు పక్రియ ముగిసింది. కాగా, మున్సిపల్ కేంద్రంలోని 10 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు పోటీ చేయగా.. మొదటి వార్డు అభ్యర్థి తాటికొండ మధు విజయం సాధించి, పదిమందిలో ఒకడిగా నిలిచాడు.
News February 14, 2026
జ్యోతికతో పెళ్లికి నిరాకరించిన సూర్య తండ్రి.. ఆ ఒక్క మాటతో!

ప్రేమికుల దినోత్సవం వేళ స్టార్ కపుల్ సూర్య, జ్యోతిక లవ్ స్టోరీ వైరలవుతోంది. వీరి పెళ్లికి తొలుత సూర్య తండ్రి శివకుమార్ అంగీకరించలేదట. ‘పెళ్లి చేసుకుంటే జ్యోతికనే చేసుకుంటా. లేదంటే ఒంటరిగా ఉంటా’ అని సూర్య కరాఖండిగా చెప్పడంతో తన మనసు మార్చుకున్నట్లు ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. 1999లో మొదలైన వీరి ప్రేమ 2006లో పెద్దల ఆశీస్సులతో పెళ్లిగా మారింది. ఈ జంటకు ఇద్దరు పిల్లలున్నారు.


