News February 11, 2025

ఉపాధి పనులలో పురోగతి ఉండాలి: కలెక్టర్

image

ఉపాధి హామీ పనులలో ప్రతివారం స్పష్టమైన పురోగతి కనిపించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. కలెక్టరేట్‌లో సోమవారం మండల స్థాయి అధికారులతో అభివృద్ధి కార్యక్రమాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉపాధి కూలీల మొబిలైజేషన్, సగటు వేతనం పెంపుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ఎంఎస్ఎంఈ సర్వేలో రోజువారి లక్ష్యాలను నిర్దేశించుకుని పకడ్బందీగా నిర్వహించాలన్నారు.

Similar News

News December 15, 2025

ఒంగోలు మేయర్ అంటే.. లెక్కలేదా: సుజాత

image

ఒంగోలు మేయర్ గంగాడ సుజాతకు కోపమొచ్చింది. నేడు మాజీ ప్రధాని వాజ్ పేయి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఒంగోలులో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి మంత్రులు సైతం హాజరవుతున్నారు. విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన శిలాఫలకంపై మేయర్ సుజాత పేరు లేకపోవడం, అలాగే ఆహ్వాన పత్రికలో సైతం ఆమె పేరు లేకపోవడంతో మేయర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. బీజేపీ నేతలు నచ్చజెప్పే ప్రయత్నంలో ఉన్నారని సమాచారం.

News December 15, 2025

జిల్లా కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

image

డిసెంబర్ నెల 15వ తేదీన సోమవారం ఒంగోలు జిల్లా కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పి. రాజాబాబు తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కలెక్టర్ మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. అర్జీదారులు తమ సమస్యలను అర్జీల రూపంలో తెలపవచ్చని సూచించారు.