News January 6, 2025

ఉపాధి పనులు ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలి: ప్రకాశం కలెక్టర్

image

ప్రకాశం జిల్లాలోని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ క్షేత్ర సహాయకులకు సోమవారం ఒంగోలులో శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ.. గ్రామాల్లో కూలీలకు రూ.300 వేతనం పెంచుటానికి ఏఏ ప్రణాళికలు ఉన్నాయో క్షేత్ర సహాయకులను అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ కార్యక్రమంలో అమలుపరుస్తున్న పల్లె పండుగ పనులను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు.

Similar News

News January 8, 2025

ప్రకాశం జిల్లాలో నేడు మోదీ ప్రారంభించేవి ఇవే..!

image

ప్రకాశం జిల్లాలో వివిధ పనులకు ప్రధాని మోదీ విశాఖ నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేస్తారు. దోర్నాల-కుంట జంక్షన్(రూ.245 కోట్లు), వెలిగోడు-నంద్యాల(రూ.601 కోట్లు) రోడ్డు విస్తరణ పనులకు శ్రీకారం చుడతారు. అలాగే రూ.108 కోట్లతో గిద్దలూరు-దిగువమెట్ట డబ్లింగ్ పనులకు భూమి పూజ చేస్తారు. రూ.907 కోట్లతో పూర్తి చేసుకున్న 6 వరుసల చిలకలూరిపేట బైపాస్‌ను ప్రారంభిస్తారు.

News January 8, 2025

కొరిశపాడు: చికిత్స పొందుతూ బాలుడి మృతి

image

ఉమ్మడి ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం తిమ్మవరం రోడ్డులోని వాటర్ ట్యాంకు వద్ద నివాసం ఉండే దుర్గారావు కుమారుడు నాగరాజు(2) ఇంటి బయట ఆడుకుంటూ నాలుగో తేదీన ఎలుకల పేస్టు తిన్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు గుంటూరు ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. హాస్పటల్ నుంచి వచ్చిన సమాచారంతో కేసు నమోదు చేశామని మేదరమెట్ల ఎస్ఐ మొహమ్మద్ రఫీ తెలిపారు.

News January 8, 2025

RRR కేసులో తులసిబాబుకు మరోసారి నోటీసులు

image

శాసనసభ ఉపసభాపతి రఘురామ కృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రైవేటు వ్యక్తి కామేపల్లి తులసిబాబుకు మంగళవారం మరోసారి నోటీసులు జారీ చేసినట్లు ఎస్సీ దామోదర్ చెప్పారు. ఈనెల 8న ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. ఈనెల 3న హాజరు కావాలని నోటీసులు ఇవ్వగా గైర్హాజరయ్యాడు.