News January 13, 2026
ఉపాధి పనుల్లో గోల్‌మాల్.. ఏకంగా రూ.21 కోట్లు

పిఠాపురం మండలంలో ఉపాధి హామీ పనుల్లో పలు అవకతవకలు జరిగినట్లు మంగళవారం నిర్వహించిన సోషల్ ఆడిట్‌లో వెల్లడైంది. 2024-25 ఏడాదికి సంబంధించి రూ.21.45 కోట్ల చెల్లింపుల్లో సంతకాలు, వేలిముద్రలు లేకుండానే నిధులు డ్రా చేసినట్లు అధికారులు గుర్తించారు. కూలీల వేతనాలు, మెటీరియల్ పనుల్లో అక్రమాలు జరిగినట్లు ఆడిట్ బృందం పేర్కొంది. క్షేత్రస్థాయిలో జరిగిన ఈ లోపాలపై అధికారులు విచారణ చేపడుతున్నారు.
Similar News
News January 26, 2026
ప్రెగ్నెన్సీలో నిద్రపట్టట్లేదా? ఈ టిప్స్ పాటించండి

నెలలు నిండే కొద్దీ గర్భిణుల్లో నిద్రలేమి పెరుగుతుంది. దీనికోసం కొన్ని చిట్కాలు చెబుతున్నారు వైద్యులు. ప్రెగ్నెన్సీలో డాక్టర్లు చెబితే తప్ప పూర్తి విశ్రాంతి తీసుకోకూడదు. తేలికపాటి వ్యాయామాలు చేయాలి. ఒత్తిడి, ఆందోళనకు దూరంగా ఉండాలి. రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, లేవడం అలవాటు చేసుకోవాలి. గ్యాడ్జెట్స్‌కు దూరంగా ఉండాలి. నిద్రకు ముందు లైట్‌గా కాళ్లు, చేతులు, తల మసాజ్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
News January 26, 2026
అమెరికా సీక్రెట్ వెపన్ పేరు చెప్పిన ట్రంప్

వెనిజులా అధ్యక్షుడు మదురోను పట్టుకునే ఆపరేషన్‌లో ‘డిస్కాంబోబులేటర్’ అనే సీక్రెట్ వెపన్ ఉపయోగించినట్లు ట్రంప్ వెల్లడించారు. ప్రత్యర్థి సైనిక పరికరాలు పూర్తిగా పనిచేయకుండా చేశామని, వారి వద్ద రష్యా, చైనా రాకెట్లు సిద్ధంగా ఉన్నప్పటికీ ఒక్కటి కూడా తమపై ప్రయోగించలేకపోయారని తెలిపారు. డ్రగ్స్ అక్రమ రవాణా చేసే వారిపై దాడులు మరింత విస్తరిస్తామని, అవసరమైతే మెక్సికో వరకూ చర్యలు ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు.
News January 26, 2026
అన్నమయ్య: ప్రభుత్వ ఉద్యోగిని ఆత్మహత్య

అన్నమయ్య జిల్లా పుంగనూరుకు చెందిన ప్రియాంక(30) ఏర్పేడులో ఈఈగా పనిచేస్తోంది. తల్లిదండ్రులు గతంలోనే చనిపోయారు. ఈక్రమంలో ఓ యువకుడితో ఆమెకు పరిచయం ప్రేమగా మారింది. అతను పెళ్లికి నిరాకరించడంతో ఓసారి ఆత్మహత్యకు ప్రయత్నించింది. దీంతో ఆమె ఫ్రెండ్ శరణ్య.. ఒంటరిగా ఉండొద్దని తిరుపతిలోని తన ఇంట్లో ప్రియాంకకు ఆశ్రయం ఇచ్చింది. శనివారం శరణ్య, ఆమె భర్త బయటకు వెళ్లిన సమయంలో ప్రియాంక ఊరేసుకుని చనిపోయింది.


