News March 2, 2026
ఉపాధి హామీలో ముంచింగిపుట్టు మండలం ఫస్ట్

ఉమ్మడి అల్లూరి జిల్లాలో ఉపాధి హామీ పనులు చేయడంలో ఈ ఏడాది ముంచింగిపుట్టు మండలం ప్రథమం స్థానంలో నిలిచిందని జిల్లా అధికారులు సోమవారం తెలిపారు. ఈ మండలంలో నిర్దేశించిన లక్ష్యంలో 99.4% పనులు పూర్తి కాగా, అరకువ్యాలీలో 99%, అనంతగిరిలో 89% పనులు పూర్తి అయ్యాయని వెల్లడించారు. 60%తో చివరి స్థానంలో మారేడుమిల్లి మండలం నిలించిందన్నారు. జిల్లాలో 1,08,35,415 పని దినాలు పూర్తియన్నారు.
Similar News
News March 2, 2026
GAILలో 70 పోస్టులు.. అప్లై చేశారా?

గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(GAIL)లో 70 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. BE/BTech,ME/MTech అర్హతగల వారు మార్చి 18 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 26ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. నెలకు రూ.60,000-రూ.1,80,000 చెల్లిస్తారు. GATE-2026 స్కోరు, గ్రూప్ డిస్కషన్/ ఇంటర్వ్యూ, అసెస్‌మెంట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సైట్: gailonline.com
News March 2, 2026
ఏపీ భవన్‌లో కంట్రోల్ రూమ్

AP: గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న తెలుగువారిని క్షేమంగా తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారు 0863-2340678, వాట్సాప్ 91 85000 27678 నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఇబ్బందుల్లో ఉన్నవారికి AP నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ(APNRT) సాయం చేస్తోందని మంత్రి వివరించారు.
News March 2, 2026
వనపర్తి: సంక్షేమ వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేయండి: కలెక్టర్

ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాలు, పాఠశాలలను జిల్లా అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థుల సమస్యలపై దృష్టి సారించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాలు, పాఠశాలల్లో వైరల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.


