News December 16, 2025
ఉపాధి హామీ శ్రామికులకు రూ.988కోట్లు విడుదల: పెమ్మసాని

AP: ఉపాధి హామీ శ్రామికుల వేతనాల కోసం రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రూ.988 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్ర శేఖర్ తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏపీకి MGNREGA కింద ఇప్పటి వరకు రూ.7,669 కోట్లు అందాయని చెప్పారు. ఇందులో రూ.5,660 కోట్లు కూలీల వేతనాలకు, రూ.2,009 కోట్లు పనుల సామగ్రి, పరిపాలనా ఖర్చులకు కేటాయించినట్లు ఆయన ట్వీట్ చేశారు.
Similar News
News December 18, 2025
సినిమాను తలపించేలా.. పెళ్లి వేదికపైనే

నాగ చైతన్య, తమన్నా నటించిన 100% లవ్ మూవీ గుర్తుందా? ఆ సినిమా ప్రీ-క్లైమాక్స్ సీన్‌లో హీరో కంపెనీకి ఒక సమస్య వస్తే ఓవైపు పెళ్లి పనులు జరుగుతుండగానే దానిని సాల్వ్ చేస్తుంది తమన్నా. దీనిని తలపించే సంఘటన రియల్ లైఫ్‌లో జరిగింది. కోయల్AI CEO సోదరి పెళ్లైన 10 నిమిషాల్లోనే తమ కంపెనీలో ఏర్పడిన బగ్‌ను పరిష్కరించడం SMలో వైరల్‌గా మారింది. కొందరు ఆమె డెడికేషన్‌ను ప్రశంసిస్తుండగా మరికొందరు విమర్శిస్తున్నారు.
News December 18, 2025
సాయంత్రం 5 గంటలకు ఎన్నికల కోడ్ ఎత్తివేత

TG: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఎన్నికల కోడ్ ఎత్తివేయనున్నట్లు పేర్కొంది. ఎన్నికల విధుల్లో మరణించిన అధికారుల కుటుంబాలకు పరిహారం చెల్లిస్తామని పేర్కొంది. బాధిత కుటుంబాలకు పరిహారం అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ నెల 11, 14, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు జరగగా NOV 25 నుంచి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది.
News December 18, 2025
2,93,587 పంపు సెట్లకు పగటి వేళే విద్యుత్: CS

AP: గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు పూర్తయితే డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గేందుకు వీలుకలుగుతుందని CS విజయానంద్ అభిప్రాయపడ్డారు. PM-KUSUM స్కీమ్ కింద వ్యవసాయ ఫీడర్ల సోలరైజేషన్ ద్వారా 2,93,587 అగ్రి పంపులకు పగలే 9 గంటలు విద్యుత్ అందించేలా పనులు కేటాయించామన్నారు. ‘స్కీమ్‌లో చేపట్టిన ప్రాజెక్టులతో 3 ఏళ్లలో ₹2,368 కోట్ల మేర పొదుపు అవుతుంది. తద్వారా టారిఫ్‌లూ తగ్గుతాయి’ అని కలెక్టర్ల సదస్సులో పేర్కొన్నారు.


