News September 11, 2025

ఉపాధ్యాయుడిగా మారిన జగిత్యాల కలెక్టర్

image

మల్లాపూర్ మండల కేంద్రంలోని గిరిజన బాలికల (మినీ గురుకుల) పాఠశాలను కలెక్టర్ సత్యప్రసాద్ గురువారం తనిఖీ చేసిన విషయం తెలిసిందే. విద్యార్థులతో ముఖాముఖి సంభాషణ జరిపి వారితో పాఠాలు చదివించి బోధనా స్థితిగతులను పరిశీలించారు. విద్యార్థుల హాజరు, తరగతుల నిర్వహణ, పారిశుద్ధ్య సౌకర్యాలు తదితర అంశాలను పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం అందుతుందా అని అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని సూచించారు.

Similar News

News September 11, 2025

కొత్తకోట: నిబంధనలు పాటించని ప్రైవేటు పాఠశాల సీజ్

image

కొత్తకోట పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్ గుర్తింపు రద్దు చేస్తున్నట్లు వనపర్తి జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ ఘని తెలిపారు. డీఈవో ఆదేశాల మేరకు గురువారం కొత్తకోట ఎంఈవో కృష్ణయ్య సిబ్బందితో కలిసి పాఠశాలను సీజ్ చేశారు. జిల్లాలోని ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలు, విద్యాశాఖ మార్గదర్శకాలు తప్పక పాటించాలని పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.

News September 11, 2025

కరీంనగర్: అమ్మవారిని దర్శించుకున్న హీరో శ్రీకాంత్

image

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం ఖాసీంపేట గ్రామంలో స్వయంభుగా వెలసిన మానసా దేవి అమ్మవారిని సినిమా హీరో శ్రీకాంత్, నటుడు భూపాల్ రాజ్, ప్రొడ్యూసర్ విజయ్ గురువారం దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. వారికి అర్చకుడు అమరనాథ్‌శర్మ మహా ఆశీర్వాదం ఇచ్చారు. ఆలయ కమిటీ ఛైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి ఆధ్వర్యంలో వారిని ఘనంగా సన్మానించారు.

News September 11, 2025

HYD: అటవీశాఖ అధికారుల త్యాగం చిరస్మరణీయం: మంత్రి

image

విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అటవీ శాఖ అధికారుల త్యాగం చిరస్మరణీయమని మంత్రి కొండా సురేఖ అన్నారు. నెహ్రూ జులాజికల్ పార్కులో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ డా.జితేందర్, పీసీసీఎఫ్ సువర్ణ, కలెక్టర్ హరిచందనలతో కలసి అమరులకు పూలతో శ్రద్ధాంజలి ఘటించారు.