News December 11, 2025

ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలి: ఎంపీ పుట్టా మహేష్ కుమార్

image

సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులందరూ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) లో ఉత్తీర్ణులు కావాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నుంచి 2010 ఆగస్టు నాటికి సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాల్సిందిగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. శీతాకాల సమావేశాల సందర్భంగా గురువారం లోక్ సభలో 377 నిబంధన కింద టీచర్ల సమస్యను ఏలూరు ఎంపీ లేవనెత్తారు. ఉపాధ్యాయుల అభ్యర్థన మేరకు పార్లమెంట్‌లో ప్రస్తావించారు.

Similar News

News December 20, 2025

HYDలో డేంజర్ లెవెల్‌‌కు ఎయిర్ క్వాలిటీ

image

HYDలో ఎయిర్ క్వాలిటీ డేంజర్ లెవెల్‌కి చేరుకుంటోంది. చలికాలం పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల నుంచి వెలువడే పొగతో కాలుష్యం పెరుగుతోంది. డబుల్ డిజిట్‌లో ఉండాల్సిన ఎయిర్ క్వాలిటీ 198కి చేరింది. శ్వాసకోస వ్యాధులు, సైనసైటిస్, డస్ట్ అలర్జీ ఉన్నవారు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలు అని డాక్టర్లు సూచిస్తున్నారు. బాలానగర్, సనత్‌నగర్, జీడిమెట్ల, మల్లాపూర్‌లో ఈ సమస్య ఎక్కువగా ఉంది.
SHARE IT

News December 20, 2025

వికారాబాద్: పగలు, ప్రతీకారాలు రగిలించిన పల్లె పోరు!

image

పచ్చని పల్లెల్లో పగలు, ప్రతీకారాలను పల్లె పోరు రగిలించింది. సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోయిన పలువురు అభ్యర్థులు గెలిచిన అభ్యర్థులపై దాడులకు దిగుతున్నారు. వికారాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లో కలిసిమెలిసి ఉండే ప్రజలంతా సర్పంచ్ ఎన్నికల్లో వర్గాలుగా ఏర్పడి దాడులు చేసుకోవడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాశంగా మారింది. ప్రస్తుతం ఉప సర్పంచ్ ఎన్నికపై కూడా ఇదే పరిస్థితి నెలకొనడంతో పలువురు మండిపడుతున్నారు.

News December 20, 2025

గుడికి వెళ్తే పాదరక్షలు ఎందుకు విప్పాలి?

image

ఆలయ పవిత్రతను కాపాడటానికి, శుచిని పాటించడానికి పాదరక్షలు బయటే వదిలేయాలి. అలాగే స్నానం చేసి కొత్త దుస్తులు ధరించాకే గుడికి వెళ్లాలి. ఎందుకంటే.. మనం ధరించే బట్టలు, పాదరక్షల ద్వారా ప్రతికూల శక్తులు గుడిలోనికి ప్రవేశించవచ్చు. దూర ప్రయాణం చేసి గుడికి వెళ్లినప్పుడు, కోనేటిలో స్నానం చేసి బట్టలు మార్చుకోవడం వలన బాహ్య అపవిత్రత తొలిగిపోయి, దైవ దర్శనానికి తగిన సానుకూల స్థితి లభిస్తుందని నమ్ముతారు.